E-Paper
Advertisement

Lockdown Movie : అనుపమ పరమేశ్వరన్ ‘లాక్ డౌన్’ వచ్చేస్తుంది… రిలీజ్ ఎప్పుడంటే..?

Lockdown Movie : అనుపమ పరమేశ్వరన్ ‘లాక్ డౌన్’ వచ్చేస్తుంది… రిలీజ్ ఎప్పుడంటే..?
Advertisement

Lockdown Movie : టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది.. గతంలో చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, టిల్లు స్క్వేర్ మాత్రం హాట్ అందాల తో రెచ్చిపోయింది. ఆ మూవీలో బోల్డ్ పాత్రలో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది. అయితే కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ ని అందుకోవడంతో ఆమె ఖాతాలో సక్సెస్ సినిమాలు అయితే పడలేదు.. ప్రస్తుతం మరో కొత్త సినిమా తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతుంది. ఆ మూవీ లాక్ డౌన్.. గత కొద్ది రోజులుగా ఈ సినిమా విడుదలకు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. మొత్తానికి విడుదల తేదీని లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

‘లాక్ డౌన్ ‘ రిలీజ్ డేట్?

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం లాక్ డౌన్.. సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతుంది సినిమా.. డైరెక్టర్ ఏఆర్ జీవా దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా గతేడాది విడుదల కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుందని లైకా ప్రొడక్షన్స్‌ ప్రకటించింది.. ఈ విషయాన్ని లైకా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఒక పోస్టర్ ని రిలీజ్ చేసి అందులో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవ్వడంతో ఎట్టకేలకు అనుపమ సినిమా థియేటర్లోకి రాబోతుంది అంటూ ఫ్రాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Advertisement

Also Read : ప్రభావతిని అనుమానించిన సత్యం.. రెచ్చిపోయిన ప్రభా.. బుక్కయిన రోహిణి..

‘లాక్ డౌన్’ స్టోరీ విషయానికొస్తే.. 

అనుపమ పరమేశ్వరన్ మొదటి నుంచి డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకులను పలకరిస్తూ వస్తుంది. ఇప్పుడు ఈమె నటించిన లాక్ డౌన్ సినిమా కూడా డిఫరెంట్ స్టోరీ తో రాబోతుంది. లాక్ డౌన్ లో చిక్కుకుపోయినవో ఎవరికి చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుందని అర్థమవుతుంది. లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయి కష్టాలు పడిన ఓ యువతి జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో అనిత అని ఓ యువతి క్యారెక్టర్ లో అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.. లాక్ డౌన్ పరిస్థితుల నుంచి ఆమె ఎలా బయటపడింది అన్నది ఈ సినిమా అసలు స్టోరీ. ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఇందులో చార్లీ, నిరోషా, ప్రియా వెంకట్, లివింగ్‌స్టన్, ఇందుమతి, రాజ్‌ కుమార్‌ ప్రత్యేక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఎన్‌ఆర్‌ రఘునందన్, సిద్ధార్థ్‌ విపిన్‌ సంగీతం అందించారు.. ఈ మూవీ తర్వాత మరో రెండు సినిమాల లో అనుపమ నటిస్తూ ఉంది..

Advertisement

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×