E-Paper
Advertisement

ఏఎన్‌ఆర్ జీవితంలో ఈ రోజుకు ఉన్న స్పెషల్ ఎంటో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

ఏఎన్‌ఆర్ జీవితంలో ఈ రోజుకు ఉన్న స్పెషల్ ఎంటో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..
Advertisement

ANR Journey: భారతీయ చలనచిత్ర పటముపై తనకంటూ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్న మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR). సరిగ్గా 82 ఏళ్ల క్రితం, 1944 మే 8న, ఒక సామాన్య యువకుడు మొదటిసారి ముఖానికి రంగు వేసుకుని కెమెరా ముందుకు వచ్చారు. ఆ రోజున పడిన ఆ చిన్న అడుగే, భవిష్యత్తులో తెలుగు సినిమా గమనాన్ని మారుస్తుందని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. ఆయన తెలుగు సినిమాలకు చేసిన సేవ ఎప్పటికే మర్చిపోలేనిది.

Read also-బాలీవుడ్ పై సిమ్రాన్ ఆగ్రహం..సౌత్ నటీనటులకు అవమానం తప్పదు!

నటుడిగా తొలి అడుగు

Advertisement

అక్కినేని నాగేశ్వరరావు తన నట జీవితాన్ని నాటక రంగంతో ప్రారంభించినప్పటికీ, వెండితెరపై ఆయన ప్రస్థానం ‘ధర్మపత్ని’ చిత్రంతో మొదలైంది. అయితే, ఆయన కథానాయకుడిగా పరిచయమైన చిత్రం ‘శ్రీ సీతారామ జననం’. ఘంటసాల బలరామయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసమే ఆయన తొలిసారి మేకప్ వేసుకున్నారు. మే 8వ తేదీ ఆయన జీవితంలోనే కాకుండా, తెలుగు సినీ చరిత్రలోనూ ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

కృషితో..

ఏ నేపథ్యం లేని ఒక గ్రామీణ యువకుడు, కేవలం తన కృషితో, పట్టుదలతో అగ్ర నటుడిగా ఎదిగిన తీరు అద్భుతం. ప్రారంభంలో ఆయన గొంతు మరియు రూపంపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ, వాటన్నింటినీ తన నటనతో పటాపంచలు చేశారు. కేవలం పౌరాణికాలకే పరిమితం కాకుండా, సాంఘిక చిత్రాల్లోనూ తనదైన ముద్ర వేశారు.

ఎప్పటికీ నిలిచిపోయే పాత్రలు

Advertisement

ANR అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఆయన పోషించిన వైవిధ్యభరితమైన పాత్రలు. అందులో ముఖ్యంగా దేవదాసు సినిమా విఫల ప్రేమికుడిగా ఆయన నటన ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది. అంతే కాకుండా తెలుగు సినిమా ఎపిక్ అయిన మాయాబజార్ లో అభిమన్యుడిగా ఆయన చురుకుదనం అజరామరం. ఇదిలా ఉంచితే.. ప్రేమాభిషేకం చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ప్రేమ కావ్యం. ఇక అన్నమయ్య సినిమాలో వృద్ధాప్యంలోనూ భక్తిరస పాత్రలో ఒదిగిపోయిన తీరు అమోఘం.

Read also-చీకటి వెనుక దాగి ఉన్న అసలు సిసలైన హారర్.. ఈ మూవీ ఒంటరిగా మాత్రం చూడకండి..

సినీ పరిశ్రమకు మార్గదర్శి

నటుడిగానే కాకుండా, తెలుగు చిత్ర పరిశ్రమను మద్రాసు (చెన్నై) నుండి హైదరాబాద్‌కు తరలించడంలో అక్కినేని కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి, ఎంతో మంది కొత్త కళాకారులకు ప్రాణం పోశారు. దాదాపు ఏడు దశాబ్దాల పాటు సాగిన ఆయన ప్రస్థానం ‘మనం’ చిత్రంతో ఒక పరిపూర్ణమైన ముగింపును చేరుకుంది. “సినిమా ఉన్నంత కాలం అక్కినేని ఉంటారు” అన్నది అతిశయోక్తి కాదు. 1944 మే 8న మొదలైన ఆ యువకుడి ప్రస్థానం, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలను అందుకుని శిఖరాగ్రాన నిలిచింది. నేడు ఆయన తొలిసారి మేకప్ వేసుకున్న ఈ సందర్భాన్ని గుర్తుచేసుకోవడం, ఆ మహానటుడికి మనం ఇచ్చే నిజమైన నివాళి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×