// // Annapurna Studios @ 50 years - అన్నపూర్ణ స్టూడియోకు 50 ఏళ్లు.. టాలీవుడ్‌ పునాది పడింది అప్పుడే.. ఇదీ ఏఎన్నార్ ఘనత -->
E-Paper
Advertisement

Annapurna Studios @ 50 years: అన్నపూర్ణ స్టూడియోకు 50 ఏళ్లు.. టాలీవుడ్‌ పునాది పడింది అప్పుడే.. ఇదీ ఏఎన్నార్ ఘనత

Annapurna Studios @ 50 years: అన్నపూర్ణ స్టూడియోకు 50 ఏళ్లు.. టాలీవుడ్‌ పునాది పడింది అప్పుడే.. ఇదీ ఏఎన్నార్ ఘనత
Advertisement

50 Years of Annapurna Studio: భారత చలన చిత్రరంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ తెలుగు సినీ ఇండస్ట్రీ. ప్రస్తుతం ఇండియన్‌ మూవీ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌లో టాలీవుడ్‌ కీలక పాత్ర పోషిస్తోంది. భారీ బడ్జెట్‌, పాన్‌ ఇండియా చిత్రాలు తెరకెక్కిస్తూ బాక్సాఫీసు వద్ద వేల కోట్ల కలెక్షన్స్‌ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ఇండియన్‌ మూవీ ఇండస్ట్రీలో టాలీవుడ్‌దే టాప్‌ ప్లేస్‌ అనడంలో సందేహం లేదు. అయితే ఈ తెలుగు సినీ ఇండస్ట్రీకి అన్నపూర్ణ స్టూడియోతోనే మొదట రాయి పడిందనే విషయం తెలుసా?. ప్రత్యేక తెలుగు సినీ పరిశ్రమ ఉండాలనే ఉద్దేశంతో ఏఎన్ఆర్ 1950లో అన్నపూర్ణ స్టూడియోని స్థాపించారు. ఈ ఏడాదితో అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఈ స్డూడియోలు విశేషాలు, దీని వెనక ఉన్న ఏఎన్ఆర్ కృషిని ఓసారి గుర్తు చేసుకుందాం!

Advertisement

సౌత్ ఇండస్ట్రీ కేరాఫ్ గా మద్రాస్

ఒకప్పుడు సినీ ఇండస్ట్రీ అంటే నాటి మద్రాసు రాష్ట్రం.. ప్రస్తుతం చెన్నై. అప్పుడు ఉత్తర, దక్షిణ సినీ పరిశ్రమలు మాత్రమే ఉండేవి. తెలుగు సినిమాలన్ని కూడా అక్కడే రూపొందేవి. స్టూడియోలు, యాక్టింగ్‌ కోర్స్‌లు కూడా చెన్నైలోనే ఉండేవి. నటీనటులు కావాలనుకునేవారు ఆంధ్ర నుంచి చెన్నైకి వెళ్లేవారు. అలా చెన్నై వెళ్లి స్టార్ హీరోలుగా మారారు. నటులు అవ్వాలంటే  మనది కానీ రాష్ట్రం వెళ్లి అక్కడ ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొని స్టార్ హీరోహీరోయిన్లు అయిన మన తెలుగు వాళ్లు ఎందరో ఉన్నారు. వారిలో మొదట వినిపంచే పేర్లు ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌లవే. వారివల్లే తెలుగువారికి అవకాశాలు దొరకడం మొదలయ్యాయి.  వారు హీరోలు వెలుగుతున్న సమయంలో ప్రత్యేక రాష్ట్రం డిమాండ్స్‌ వచ్చాయి. 

Advertisement

ఏఎన్ఆర్ కృషి ఫలితమే అన్నపూర్ణ స్డూడియో

ఇక ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పాడ్డాక.. తెలుగు వాళ్లకు కూడా ప్రత్యేకమైన సినీ పరిశ్రమ ఉండాలని ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌లు ఆలోచించి హైదరాబాద్‌లో తెలుగు సినీపరిశ్రమ స్థాపనకు కృషి చేశారు. సినీ పరిశ్రమకు అక్కినేని నాగేశ్వర్‌ రావు అందించిన సేవలను గుర్తిస్తు ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని 22 ఏకరాల భూమిని కేటాయించారు. తెలుగు సినీ పరిశ్రమకు తన సొంత భూమిలోనే పునాది పడాలనే ఉద్దేశంలో అన్నపూర్ణ స్డూడియోను స్థాపించారు. అలా 1975 ఆగష్టు 13న అన్నపూర్ణ స్డూడియోను స్థాపినకు శంకుస్థాపన చేశారు. ఏడాదిలోనే అక్కడ ఓ ఇల్లు, స్టూడియో నిర్మించారు. 1976 జనవరి 14న అనాటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ అధికారంగా అన్నపూర్ణ స్టూడియోను నిర్మించారు.

బంజరు భూమిని బ్రాండ్ సిటీగా..

ఇప్పుడు మహానగరంగా ఉన్న హైదరాబాద్‌ ఒకప్పుడు కొండలు, గుట్టలతో ఉండేదనే విషయం తెలిసిందే. ప్రస్తుతం అత్యంత కాస్లీ ఏరియాగా ఉన్న బంజారాహిల్స్‌ ఒకప్పుడు వట్టి బంజర భూమి. అప్పుడే ఏపీ ప్రభుత్వం ఈ బంజర భూమిని ఏఎన్‌ఆర్‌కు కేటాయించింది. అన్నపూర్ణ స్టూడియో స్థాపనకు ముందు ఇదంత కొండలు, గుట్టలతో ఉండేది. రోడ్లు లేవు, నిర్మాణాలు లేవు. అలాంటి భూమినిలో అన్నపూర్ణ స్డూడియోకు పునాది వేశారు. చెట్లు, కొండలు తొలగించి విశాలవంతమై భూమిగా మార్చి అక్కడ స్డూడియో నిర్మాణాన్ని చేపట్టారు. అలా జనవరి 14, 1976న బంజారాహిల్స్‌లో అన్నపూర్ణ స్టూడియో వెలిసింది. అప్పుడు అక్కడ ఏలాంటి ఇళ్లు, నిర్మాణాలు కూడా లేవు. స్టూడియోకు వెళ్లేందుకు కనీసం రోడ్లు కూడా లేవు. అలాంటి ప్లేస్‌లో స్టూడియో నిర్మించిన ఏఎన్‌ఆర్‌ సినీ ఇండస్ట్రీని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. అలా బంజర్ భూమిని బ్రాండ్ సిటీగా మార్చారు. 

ఆ తర్వాత మెల్లిమెల్లిగా దానిని డెవలప్‌ చేస్తూ సినిమా ఇండస్ట్రీలోనే మోస్ట్‌ క్రియేటివ్‌ ప్లేస్‌గా అన్నపూర్ణ స్టూడియోని నిలబెట్టారు.  స్టూడియో స్థాపన తర్వాత ఈ బంజరు భూమి మెల్లిమెల్లిగా డెవలప్ అవ్వడం ప్రారంభమైంది. అలా జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, కృష్ణ నగర్‌లు వెలిశాయి. ప్రస్తుతం దేశంలోని సినీరంగంలోనే అత్యాధునిక వసతులు ఉన్న స్టూడియో ఇది. ప్రస్తుతం ఇక్కడ సీరియల్స్‌ నుంచి సినిమాల వరకు ఎన్నో చిత్రాల షూటింగ్స్‌ జరుగుతుంటాయి. అంతేకాదు బహిరంగ సెట్స్‌, బహుళ షూటింగ్‌ అంతస్తులు, పోస్ట్‌-ప్రొడక్షన్‌ సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాదు నటీనటులకు శిక్షన ఇచ్చేందుకు అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియాను స్థాపించారు. నటన, దర్శకత్వం, సినిమాటోగ్రపీ, ఎడిటింగ్‌, సౌండ్‌ డిజైన్‌ వరకు శిక్షణ ఇస్తున్నారు. అలా ఏఎన్‌ఆర్ కృషి ఫలితంగా హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియో వెలిసి.. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కీలకంగా మారింది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×