// // Anil Sunkara On bhola Shankar: భోళా శంకర్ అందుకే ఆడలేదు! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Anil Sunkara On bhola Shankar: భోళా శంకర్ అందుకే ఫ్లాప్ అయ్యింది.. ఓపెన్ అయిన అనిల్ సుంకర

Anil Sunkara On bhola Shankar: భోళా శంకర్ అందుకే ఫ్లాప్ అయ్యింది.. ఓపెన్ అయిన అనిల్ సుంకర
Advertisement

Anil Sunkara On bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించిన చిత్రం భోళా శంకర్(Bhola Shankar). 2023, ఆగస్టు 18వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుము విడుదలైన ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వేదాళం సినిమాకు రీమేక్ చిత్రంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మించారు. ఈ సినిమా ద్వారా నిర్మాతకు బోలెడు నష్టాలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఒరిజినల్ కంటెంట్ చూడటమే కారణమా?

తాజాగా అనిల్ సుంకర ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలను తెలియజేశారు. ప్రస్తుతం అనిల్ సుంకర నిర్మాణంలో శర్వానంద్ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari) సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 15వ తేదీ విడుదల కాగా 14వ తేదీ సాయంత్రం ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అనిల్ సుంకర ఒక ఇంటర్వ్యూలో భాగంగా భోళా శంకర్ ఫ్లాప్ కావడం గురించి స్పందించారు. భోళా శంకర్ సినిమా విడుదల కంటే ఒక మూడు సంవత్సరాలు ముందే విడుదల అయ్యి ఉంటే కచ్చితంగా హిట్ అయ్యేదని తెలియజేశారు.

డిజాస్టర్ గా భోళా శంకర్..

Advertisement

ఈ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులదరూ ఒరిజినల్ సినిమాని చాలాసార్లు చూడటం వల్లే రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భోళా శంకర్ సినిమాని ఆదరించలేకపోయారని, అందుకే ఈ సినిమా ఫ్లాప్ అయింది అంటూ అనిల్ సుంకర ఇన్ని రోజులకు ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం గురించి స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా తమన్న నటించగా , కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలు పాత్రలో నటించి సందడి చేశారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి తదుపరి మన శంకర వరప్రసాద్ గారు (MSVPG)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీ విడుదల కానుంది.

సంక్రాంతి బరిలో శర్వానంద్..

Advertisement

ఇక అనిల్ సుంకర నిర్మాణంలో తెరకెక్కిన నారీ నారీ నడుమ మురారి సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇందులో శర్వాకు జోడిగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు సామజ వరగమన ఫేమ్ డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల సినిమా నుంచి ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో భాగంగా మరొక నటుడు శ్రీ విష్ణు కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారని తెలియజేశారు. ఇటీవల కాలంలో సరైన సక్సెస్ లేక ఎంతో సతమతమవుతున్న శర్వానంద్(Sharwanand) మరో ఫ్యామిలీ ఎంటర్టైన్ ద్వారా సంక్రాంతి రేసులో దిగారు. మరి ఈ సినిమా ద్వారా అయినా హిట్ అందుకుంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read; Chiranjeevi: మళ్ళీ సర్జరీ చేయించుకున్న చిరంజీవి.. ప్రమోషన్లకు అందుకే దూరమా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×