E-Paper
Advertisement

AIRFORCE – Bezawada Batch : కొత్తవారితో అనిల్ సుంకర ‘ఎయిర్‌ఫోర్స్‌–బెజవాడ బ్యాచ్’… వినూత్న రీతిలో అనౌన్స్మెంట్

AIRFORCE – Bezawada Batch : కొత్తవారితో అనిల్ సుంకర ‘ఎయిర్‌ఫోర్స్‌–బెజవాడ బ్యాచ్’… వినూత్న రీతిలో అనౌన్స్మెంట్
Advertisement

AIRFORCE – Bezawada Batch : సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉండాలే గానీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అంటూ ఉంటారు. కానీ అలా టాలెంట్ ఉండి కూడా ఒకే ఒక్క అవకాశం వస్తే చాలని ఎదురుచూసే వాళ్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ల కోసమే ఈ గుడ్ న్యూస్. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర తాజాగా మరోసారి టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు అందించి, ప్రోత్సహించడానికి ముందడుగు వేశారు. అందులో భాగంగా తాజాగా ఆయన ఏటివి ఒరిజినల్స్ (ATV Originals) అనే బ్యానర్ పై కొత్త నటీనటులతో రూపొందిస్తున్ ఫీచర్ ఫిలింను అనౌన్స్ చేశారు.

అందరూ కొత్తవాళ్లే

సాధారణంగా నిర్మాతలు స్టార్ హీరో హీరోయిన్లతో సినిమాలు తీసి లాభాలు కళ్ల చూడాలని అనుకుంటారు. కానీ కంటెంట్ కు ప్రాధాన్యతను ఇస్తూ సినిమాలు నిర్మించే నిర్మాతగా పేరొందిన అనిల్ సుంకర మాత్రం నిర్మాతలలోనే డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఇదివరకే ఆయన అనౌన్స్ చేసిన మూవీ మేకింగ్ రియాలిటీ షో ‘టైం సినిమా తీద్దాం రండి’కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఇప్పుడు టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా… అనిల్ సుంకర ‘ఎయిర్ ఫోర్స్ – బెజవాడ బ్యాచ్’ అనే కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. ఈ మూవీ ఏటీవీ ఒరిజినల్స్ పై కొత్త నటీనటులతో రూపొందుతోంది.

Advertisement

‘అమెరికాకు వెళ్లి మా బెజవాడ బ్యాచ్ ని ఖాళీగా తిరగకండిరా ఏదో పని చేసుకోమని సలహాలు ఇచ్చేంత స్థాయికి ఎరిగిన మా అర్జున్ కు స్వదేశాగమన శుభాకాంక్షలు’ అంటూ రూపొందించిన ఈ బ్యానర్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఫీల్ గుడ్ ఫ్రెండ్షిప్, బెజవాడ వెటకారం కలగల్సి ఈ సినిమా ఆసక్తికరంగా రూపొందనుంది. ఇక ఈ ప్రాజెక్ట్ కేవలం కొత్త ఆరంభం మాత్రమే కాదని, కొత్త టాలెంట్ ను, సినిమా ఇండస్ట్రీలో నిరూపించుకోవాలని కలలుగనే వారికి ఓ మంచి గోల్డెన్ అపార్చునిటీ అని మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించిన మిగతా వివరాలను విడుదల చేయనున్నారు.

ఇదే కథ

‘ఎయిర్ ఫోర్స్ – బెజవాడ బ్యాచ్’ అనే ఈ మూవీ విజయవాడ నేపథ్యంలో సాగనుంది. నలుగురు నిరుద్యోగ యువకుల జీవితంలో జరిగిన ఆసక్తికర సంఘటనల ఆధారంగా మూవీ తెరకెక్కనుంది ఆ నలుగురు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి చేసే ప్రయాణంలో ఎలాంటి కష్టాలను దాటారు? చివరికి ఎలా సక్సెస్ సాధించారు? అనేది ఈ మూవీ స్టోరీ. ఇక తాజాగా ఈ సినిమా ను అఫీషియల్ గా షురూ చేస్తూ, ఫస్ట్ కాస్ట్ మెంబర్ ను వినూత్న రీతిలో ఆన్ బోర్డ్ చేయడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. విజయవాడలోని ఒక ప్రముఖ జంక్షన్ మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యానర్ ద్వారా విషయాన్ని అనౌన్స్ చేశారు.

Advertisement

Read Also : నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ నెంబర్ 1లో ఉన్న 2 గంటల 45 నిమిషాల లవ్ స్టోరీ… ఇంకా చూడలేదా ?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×