E-Paper
Advertisement

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఫ్యామిలీని చూశారా.. ఏంటీ అనిల్ కి ఇంత పెద్ద కూతురుందా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఫ్యామిలీని చూశారా.. ఏంటీ అనిల్ కి ఇంత పెద్ద కూతురుందా?
Advertisement

Anil Ravipudi: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఓటమంటూ ఎరగకుండా.. తన సినిమాలతో వరుస కలెక్షన్లు రాబడుతూ అటు హీరోలకి కూడా మంచి విజయాన్ని అందిస్తున్న డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా ప్రాంతీయంగా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్న ఈయన.. తన చిత్రాలతో ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. గతంలో వరుస ఫ్లాప్ లతో సతమతమవుతూ ఒక్క హిట్టు కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ తో ‘పటాస్’ సినిమా చేసి దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనిల్ రావిపూడి (Anil Ravipudi) .. అప్పటి నుంచి ప్లాపులో ఉన్న హీరోలతో సినిమాలు చేస్తూ దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నారు.

కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న అనిల్ రావిపూడి..

ఇప్పటికే వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈయన తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు మంచి విజయాన్ని అందించినందుకు శ్రీవారికి ధన్యవాదాలు తెలుపుతూ కుటుంబ సమేతంగా తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. తన తల్లి, తండ్రి తో పాటు భార్య, కొడుకు, కూతురుతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు అనిల్ రావిపూడి.

అనిల్ రావిపూడికి ఇంత పెద్ద కూతురుందా?

Advertisement

ఇకపోతే ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఏంటి అనిల్ రావిపూడి కి ఇంత పెద్ద కూతురు ఉందా? ఎంత క్యూట్ గా ఉందో అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఒక మెట్టు ఎక్కి అనిల్ రావిపూడి వేరే చిన్నారులను తన సినిమాలో పెట్టడం కంటే తన పిల్లల్ని సినిమాలో నటింపచేస్తే బెటర్ కదా అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. ఏదేమైనా అనిల్ రావిపూడి ఫ్యామిలీ తొలిసారి మీడియా ముందుకు రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఫ్యామిలీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ALSO READ:Director Teja: డైరెక్టర్ తేజ కొడుకుపై క్రిమినల్ కేస్.. మహిళతో అసభ్య ప్రవర్తన!

ఆ హీరోని లైన్లో పెడుతున్న అనిల్ రావిపూడి..

Advertisement

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసిన అనిల్ రావిపూడి ఇప్పుడు నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు మరోసారి మల్టీ స్టారర్ కాన్సెప్ట్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇదివరకే ఎఫ్2 నుండి మన శంకర్ వరప్రసాద్ గారు వరకు మల్టీ స్టారర్ కాంబినేషన్లతోనే సినిమాలు చేసి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈయన.. మరోసారి అదే విజయ మ్యాజిక్ ను రిపీట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే వచ్చే సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకున్న అనిల్ రావిపూడి మళ్లీ వెంకటేష్ తో సినిమా చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు మరో స్టార్ హీరోని రంగంలోకి దింపుతున్నారట. ఇక అన్ని ఓకే అయితే త్వరలోనే తన స్క్రిప్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలను బయటపెడతానని తెలియజేశారు అనిల్ రావిపూడి. మరి వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోయే ఆ మరో స్టార్ హీరో ఎవరు త్వరలోనే తెలియనుంది..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×