E-Paper
Advertisement

బుల్లిరాజును వరించిన క్రేజీ అవార్డ్.. అంతా ఆయన దయే!

బుల్లిరాజును వరించిన క్రేజీ అవార్డ్.. అంతా ఆయన దయే!
Advertisement

Tollywood: బుల్లి రాజు.. గత ఏడాదికాలంగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది.. గత ఏడాది హిట్ మిషన్ ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh ) హీరోగా, ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్లుగా వచ్చిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. అటు వెంకటేష్ కి ఇటు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరికి మంచి గుర్తింపు లభించింది. ఇదిలా ఉండగా అలాంటి ఈ సినిమా తాజాగా అరుదైన ఘనతను సాధించింది.

బుల్లిరాజుకి అవార్డ్..

తాజాగా ప్రకటించిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCP -2026 ) 2026 అవార్డులకు ఎంపిక అవ్వడం అభిమానులకు తియ్యని వేడుక అని చెప్పవచ్చు. బెస్ట్ డైరెక్టర్ తో పాటు బెస్ట్ యాక్టర్ కామెడీ రోల్ విభాగంలో అవార్డులను దక్కించుకుంది ఈ చిత్రం. బెస్ట్ డైరెక్టర్ విభాగంలో అనిల్ రావిపూడి అవార్డును సొంతం చేసుకోగా.. కామెడీ రోల్ బెస్ట్ యాక్టర్ గా రేవంత్ అలియాస్ బుల్లి రాజు అవార్డును దక్కించుకున్నారు. ఇక ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ఎక్స్ వేదికగా స్పందించింది.

అంతా ఆయన దయే..

Advertisement

ఇకపోతే బుల్లి రాజుకి బెస్ట్ కామెడీ రోల్ విభాగంలో అవార్డు లభించడంతో అంతా అనిల్ రావిపూడి దయా అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. మరికొంతమంది పవన్ కళ్యాణ్ దయ అని కామెంట్ చేస్తున్నారు. మధ్యలో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చారనే డౌట్ మీకు కలగవచ్చు.. వాస్తవానికి జనసేన పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగానే బుల్లిరాజు జనసేన ప్లకార్డ్ లు పట్టుకొని తెగ తిరిగేసాడు . తన వీడియోలతో హల్చల్ చేశాడు. ఆ వీడియోలు చూసిన అనిల్ రావిపూడి తన సినిమాలో ఆయనకు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. అందుకే అంతా పవన్ కళ్యాణ్ దయ అంటూ ఉదాహరణలు కూడా వివరిస్తున్నారు పీకే అభిమానులు. ఏది ఏమైనా.. ఎవరి దయ అయినప్పటికీ.. బుల్లి రాజుకు మాత్రం ఇప్పుడు అవార్డు లభించడం నిజంగా ప్రశంసనీయం అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

also read:రాజ్ లేకపోతే ఈ జీవితమే లేదు.. భర్త పై సమంత ఊహించని కామెంట్!

దూకుడు పెంచిన బుల్లిరాజు..

Advertisement

ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకున్న బుల్లిరాజు ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు, షోలు అంటూ తెగ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఏడాది మళ్లీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలయికలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో కూడా బుల్లిరాజు నటించి మెప్పించారు. ఇక అలాగే మరికొన్ని టీవీ షోలలో కూడా బుల్లిరాజు సందడి చేస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×