E-Paper
Advertisement

MSVPG Film: మన శంకర వరప్రసాద్ గారిలో వెంకటేష్ పాత్ర ఎప్పుడో రివీల్ చేసిన డైరెక్టర్..

MSVPG Film: మన శంకర వరప్రసాద్ గారిలో వెంకటేష్ పాత్ర ఎప్పుడో రివీల్ చేసిన డైరెక్టర్..
Advertisement

MSVPG Film: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi)హీరోగా నటించిన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు(MSVPG). ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జనవరి 12వ తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార(Nayanatara) నటించిన సంగతి తెలిసిందే. నయనతార శశిరేఖ పాత్రలో కనిపించి సందడి చేయబోతున్నారు. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక మన శంకర వరప్రసాద్ గారు సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేశారు.

క్లైమాక్స్ లో వెంకటేష్ పాత్ర..

తాజాగా ఈ సినిమా నుంచి మెగా విక్టరీ మాస్ సాంగ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) సైతం సందడి చేయబోతున్నారు. ఇలా ఈయన క్యామియో పాత్ర సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. అయితే వెంకటేష్ పాత్ర సినిమాలో ఎప్పుడూ ఉండబోతోంది? ఆయన తెరపై ఎంతసేపు కనిపిస్తారు? ఏంటి అనే విషయాల పట్ల అభిమానులు ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా అనిల్ రావిపూడి వెంకటేష్ పాత్ర గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

25 నిమిషాలు కనిపించనున్న వెంకటేష్..

Advertisement

ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతుందని తెరపై చిరంజీవి వెంకటేష్ గారిని చూస్తూ ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అనిల్ రావిపూడి తెలిపారు . ఇక వెంకటేష్ పాత్ర సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ముందు ఉంటుందని తెలియజేశారు. దాదాపు 25 నిమిషాల పాటు తెరపై వెంకటేష్ సందడి చేయబోతున్నారని , ఇక వెంకటేష్ గారి పాత్ర గురించి ఇంతకుమించి తాను ఒక మాట కూడా చెప్పను, ముందే చెబితే ఆ థ్రిల్ ఉండదని నేరుగా థియేటర్లో చూస్తేనే చాలా బాగా ఎంజాయ్ చేస్తారంటూ అనిల్ రావిపూడి ఈ సందర్భంగా వెంకటేష్ పాత్ర పై మంచి హైప్ పెంచేశారు.

NIA అధికారిగా చిరు..

Advertisement

ఇటీవల కాలంలో చిరంజీవి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా కాలం అవుతుంది. ఇలా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే శశిరేఖ, మీసాల పిల్లా వంటి పాటలను విడుదల చేశారు. తాజాగా మూడో పాటను కూడా విడుదల చేయడంతో ఈ పాట మంచి ఆదరణ పొందుతుంది. ఈ సినిమాలో చిరంజీవి NIA అధికారిగా కనిపించబోతున్నారని నయనతార డబ్బున్న అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నారు అంటూ ఇదివరకు వార్తలు వచ్చాయి.\

Also Read: Anaganaga Oka Raju: అనగనగా ఒక రాజు రన్ టైం లాక్.. నిడివి ఎంతంటే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×