E-Paper
Advertisement

Anil Ravipudi: ఆ సినిమా టీజర్‌కి అనిల్ రావిపూడి ఫిదా!

Anil Ravipudi: ఆ సినిమా టీజర్‌కి అనిల్ రావిపూడి ఫిదా!
Advertisement

Anil Ravipudi: జ్యోతి పూర్వజ్ (Jyoti Poorvaj), పూర్వాజ్ (Poorvaaj) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా ‘కిల్లర్’ (Killer Movie). మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్‌పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి. ఎ నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్‌ని తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్‌కు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫిదా అయ్యారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆయన ఈ టీజర్‌పై ప్రశంసలు కురిపించారు. ‘‘కిల్లర్ మూవీ టీజర్ చాలా బాగుంది.. దర్శకుడు పూర్వాజ్, సూపర్ షి జ్యోతి పూర్వజ్‌కు ఆల్ ది బెస్ట్. ప్రామిసింగ్‌గా ఉన్న ఈ టీజర్‌ను లాంచ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్‌లో ఇంకా మరిన్ని థ్రిల్స్ ఉంటాయని ఆశిస్తున్నాను. చిత్ర యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు’’ అని అనిల్ రావిపూడి (Anil Ravipudi) తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read- Om Shanthi Shanti Shantihi OTT: ఓటీటీలోకి తరుణ్, ఈషా రెబ్బాల పెళ్లి.. వివరాలివే!

ఆరేడు క్యారెక్టర్స్ చేసే అదృష్టం

Advertisement

టీజర్ లాంఛ్ కార్యక్రమంలో హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ.. నేను సీరియల్స్‌లో రొటీన్ పాత్రలు చేస్తూ విసిగిపోయాను. అలాంటి టైమ్‌లో సుకు పూర్వాజ్ నన్ను స్క్రీన్ మీద కొత్తగా చూపించేందుకు ఈ సినిమాతో వచ్చారు. అసలు ఆరేడు క్యారెక్టర్స్ ఉన్న ఇలాంటి మూవీ ఒకటి చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఎవరైనా డ్యూయల్ రోల్ చేస్తారు కానీ ఆరేడు క్యారెక్టర్స్‌లో పెర్ఫార్మ్ చేసే అవకాశం రావడం ఏ యాక్టర్ కైనా డ్రీమ్ అనుకోవచ్చు. ఈ సినిమాలో నాతో యాక్షన్ కూడా చేయించారు. విజయశాంతిలా యాక్షన్ చేయాలని నాకూ డ్రీమ్ ఉండేది. అలాంటి అవకాశం ఈ చిత్రంతో దక్కింది. పూర్వాజ్ ఇచ్చిన సపోర్ట్‌తోనే నేను ఈ సినిమా చేయగలిగాను. ఈ మూవీ కోసం డైరెక్టర్ పూర్వాజ్ చాలా కష్టపడ్డాడు.

Also Read- Ustaad Bhagat Singh: పవన్ కు విలన్ గా మల్లారెడ్డి .. అందుకే తీసుకోలేదన్న హరీష్ శంకర్!

డబ్బులు చేసుకుందామని కాదు..

Advertisement

పెళ్లయ్యాక చాలా మంది పర్సనల్ వెకేషన్‌కు వెళ్తారు. కానీ, మనం సినిమా చేద్దామని పూర్వాజ్ నాతో అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా చేయడం ద్వారా చాలా మందికి ఎంతో కొంత ఉపాధి కల్పించినవారమవుతాం అనుకున్నాను. జ్యోతి అంటే మంచి పెర్ఫార్మర్ అని, పూర్వాజ్ అంటే మంచి డైరెక్టర్ టెక్నీషియన్ అని ఈ చిత్రంతో ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. పూర్వాజ్‌లో అమేజింగ్ యాక్టర్ ఉన్నాడు. రీసెంట్‌గా డైరెక్టర్ అనిల్ రావిపూడి మా సినిమా టీజర్ రిలీజ్ చేసి, పూర్వాజ్‌లో మంచి యాక్టర్ ఉన్నాడని కొనియాడారు. మాకున్న లిమిటేషన్స్ దాటి ఈ సినిమాను తెరకెక్కించాం. ఈ చిత్రంతో డబ్బులు చేసుకుందామని కాదు.. మేకర్స్‌గా ఒక ఫౌండేషన్ వేసుకోవాలనే ప్రయత్నిస్తున్నాం. మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. టీజర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడికి మా అందరి తరపున థ్యాంక్స్ చెబుతున్నామని అన్నారు.

Also Read- Yash Toxic: యష్ ‘టాక్సిక్’ నుంచి మరో యాక్టర్ లుక్ విడుదల.. ఎవరో తెలుసా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×