E-Paper
Advertisement

Andhra King Taluka OTT : ‘ఆంధ్రా కింగ్ తాలూకా ‘ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Andhra King Taluka OTT : ‘ఆంధ్రా కింగ్ తాలూకా ‘ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Advertisement

Andhra King Taluka OTT : టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, బ్యూటిఫుల్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటించిన లేటెస్ట్ చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా.. గత కొన్ని ఏళ్లుగా సరైన హిట్ సినిమాలు ఎన్ని రామ్ కథలో ఈ సినిమా భారీ విజయాన్ని అందించేలా కనిపిస్తుంది.. మూవీ మొదలైనప్పటి నుంచి ఇవాళ థియేటర్లలోకి వచ్చేవరకు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ని పెంచేసింది.. సినిమా నుంచి బయటకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. దాంతో ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని రివ్యూలను చూస్తే తెలుస్తుంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి దీంతో రామ్ హిట్ కొడతాడా? లేదా యావరేజ్ టాక్ ను అందుకుంటాడా? అన్నది తెలియాలంటే మౌత్ టాక్ తో పాటుగా కలెక్షన్స్ కూడా తెలియాలి. ఇదిలా ఉండగా ఈ చిత్రం ఓటీటీ రైట్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. ఆ వివరాలను ఒకసారి తెలుసుకుందాం..

‘ఆంధ్రా కింగ్ తాలూకా ‘ ఓటీటీ పార్ట్నర్ లాక్.. 

ఈ మూవీలో రావు రమేశ్, మురళీ శర్మ, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్‌లు, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలకపాత్రలను పోషించారు.. మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి ఫేమ్‌ మహేష్‌ బాబు పి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సినిమాను నిర్మించింది.. మొదటి నుంచి మూవీ పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. రామ్ చాలా కష్టపడ్డాడు అని టీజర్లు, ట్రైలర్స్ చూస్తే అర్థం అవుతుంది. ఎన్నో ఆశలతో, భారీ అంచనాలతో ఈ మూవీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మొదటి షో నుంచి పాజిటీవ్ టాక్ ను అందుకుంటుందని రివ్యూలు చెబుతున్నాయి. ఇన్నేళ్లుకు రామ్ ఖాతాలో హిట్ పడిందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక మూవీ ఓటీటీ హక్కులను భారీ ధరకు ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక శాటిలైట్ రైట్స్ ను జీతెలుగు భారీ ధరకు కొనుగోలు చేసుకుంది. సినిమా టాక్ ను బట్టి జనవరి మొదటి వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Advertisement

Also Read : తిరుపతికి దొరికిన శ్రీవల్లి.. నగల మ్యాటర్ రీవిల్.. రచ్చ చేసిన భద్ర, సేనా..

సినిమా ఎలా ఉందంటే..?

రామ్ కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకున్నాడు.. ఎప్పటిలాగా కాకుండా డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఆయన నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. ప్రతి ఫ్యాన్‌కి బయోపిక్ లాంటిది. సినిమా పిచ్చి ఉన్న ప్రతి అభిమాని స్వీయ అనుభవాన్ని పొందుతారు. ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంది. సెకండాఫ్ ఎమోషనల్‌గా మారిపోయింది. రామ్ ఔట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఇక ఉపేంద్ర యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొత్తానికి గతంలో వచ్చిన రామ్ సినిమాలకు ఈ సినిమా చాలా డిఫరెంట్ గా కొత్తగా ప్రేక్షకుడికి అనుభూతిని కలిగిస్తుంది అని రివ్యూలు వస్తున్నాయి. ఇక ఈ మూవీ కలెక్షన్స్ ఏ మాత్రం ఉంటాయో చూడాలి..

Tags

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×