E-Paper
Advertisement

Andhra King Taluka: ఫస్ట్ డే ఫస్ట్ షో లిరికల్ సాంగ్ రిలీజ్ ..రామ్ ఎనర్జీ వేరే లెవెల్ !

Andhra King Taluka: ఫస్ట్ డే ఫస్ట్ షో లిరికల్ సాంగ్ రిలీజ్ ..రామ్ ఎనర్జీ వేరే లెవెల్ !
Advertisement

Andhra King Taluka: రామ్ పోతినేని (Ram Pothineni)భాగ్యశ్రీ(Bhagya Shri) హీరో హీరోయిన్లుగా పి. మహేష్ బాబు దర్శకత్వంలో తెరికెక్కిన తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా (Andhra King Taluka). ఈ సినిమా నవంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలను విడుదల చేయగా విపరీతమైన ఆదరణ లభించింది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి నాలుగవ పాటను విడుదల చేశారు. “ఫస్ట్ డే.. ఫస్ట్ షో” (First Day First Show) అంటూ సాగిపోయే ఈ పాటకు సంబంధించిన లిరిక్స్ విడుదల చేయడంతో ఈ పాట కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఫస్ట్ డే.. ఫస్ట్ షో సాంగ్ రిలీజ్..

ఇక ఈ పాటలో రామ్ హై ఎనర్జీ లెవెల్ పర్ఫామెన్స్ ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఒక హీరో అభిమానిగా థియేటర్ ముందు రామ్ చేసే రచ్చ మామూలుగా కనిపించట్లేదు. ఇక ఈ పాట విషయానికి వస్తే ఈ పాటకు దినేష్ కాకర్ల లిరిక్స్ అందించగా.. వివేక్ , మెర్విన్ సంగీతం అందించారు. ఇక ఈ పాట లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఇక ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమాని కంటే ముందుగా హీరో రామ్ భారీ కటౌట్ కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆంధ్ర కింగ్ గా ఉపేంద్ర..

Advertisement

ఇక ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో ఆంధ్ర కింగ్ పాత్రలో కన్నడ నటుడు ఉపేంద్ర (Upendra) కనిపించబోతున్నారు . ఆంధ్ర కింగ్ పాత్రలో నటిస్తున్న ఉపేంద్రకు వీరాభిమానిగా సాగర్ అనే పాత్రలో రామ్ నటించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం సినిమాపై మంచి అంచనాలు పెంచేయడమే కాకుండా రామ్ ఈ సినిమాతో హిట్ కొట్టబోతున్నారని కూడా స్పష్టం అవుతుంది. మరి నవంబర్ 28వ తేదీ థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా రామ్ కెరియర్ కు ఏ విధంగా ఉపయోగపడుతుందనేది తెలియాల్సి ఉంది.

Advertisement

గత కొంతకాలంగా రామ్ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ సరైన స్థాయిలో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. ఈయన చివరిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ రామ్ మాత్రం సరైన సక్సెస్ అందుకోలేకపోయారు. రామ్ అభిమానుల ఆశలన్నీ కూడా ఆంధ్రకింగా తాలూకా సినిమాపైనే ఉన్నాయి. ఇక ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించి సందడి చేశారు. రాహుల్ రామకృష్ణ, మురళి శర్మ, రావు రమేష్ వంటి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Also Read: Sharwanand Divorce: విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన శర్వానంద్.. అన్ని రూమర్లేనా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×