E-Paper
Advertisement

Anasuya vs Sivaji: శివాజీపై అనసూయ లీగల్ వార్‌..? ఇప్పట్లో వదిలేలా లేదే..!

Anasuya vs Sivaji: శివాజీపై అనసూయ లీగల్ వార్‌..? ఇప్పట్లో వదిలేలా లేదే..!
Advertisement

Anasuya vs Sivaji: టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా హీరోయిన్ల దుస్తుల వివాదం కార్చిచ్చులా వ్యాపిస్తోంది. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఒకెత్తయితే, దానికి అనసూయ ఇస్తున్న కౌంటర్లు ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. శివాజీ పశ్చాత్తాపం వ్యక్తం చేసినా, అనసూయ మాత్రం ఈ విషయాన్ని అంత తేలికగా వదిలేలా లేదు.

‘తిరిగి ఇచ్చేస్తా’ అన్న శివాజీ
ప్రెస్ మీట్‌లో శివాజీ మాట్లాడుతూ.. సమయం వస్తే తగిన సమాధానం చెబుతాను, అనసూయకు తిరిగి ఇచ్చేస్తాను అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై అనసూయ గట్టిగానే రియాక్ట్ అయ్యారు. నేను కూడా సినిమాల్లో లీడ్ రోల్స్ చేశాను, శివాజీ అన్న మాటలు నాకు కూడా వర్తిస్తాయి అంటూ ఆమె తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా, ఈసారి ఆమె ఏకంగా చట్టపరమైన అంశాలను తెరపైకి తెచ్చారు.

Advertisement

అడ్వకేట్ వీడియోతో షాక్
తాజాగా అనసూయ తన సోషల్ మీడియాలో ఒక అడ్వకేట్ మాట్లాడిన వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో.. బహిరంగ వేదికలపై మహిళల గురించి, వారి వ్యక్తిగత స్వేచ్ఛ గురించి అనుచితంగా మాట్లాడితే ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేయవచ్చో ఆ న్యాయవాది వివరంగా వివరించారు. శివాజీ పేరు ఎత్తకపోయినప్పటికీ, ఈ వీడియో ఆయనను ఉద్దేశించే పెట్టినట్లు స్పష్టమవుతోంది.

 

Advertisement

క్షమాపణలు చెప్పినా తగ్గని సెగ..
శివాజీ తాను వాడిన పదాలకు క్షమాపణలు చెప్పినప్పటికీ, మహిళల వస్త్రధారణ పద్ధతిగా ఉండాలి అన్న తన పాత ధోరణిలోనే ఉండటం అనసూయను మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఒక పక్క శివాజీ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారని ఆమె ఆరోపిస్తుండగా, మరోపక్క లీగల్‌గా ఆయనకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ఈ వీడియో సంకేతాలిస్తోంది. మరి ఈ వీడియోపై శివాజీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×