E-Paper
Advertisement

మరోసారి చీర వివాదంపై ఘాటుగా స్పందించిన అనసూయ.. శివాజీ సృష్టించిన చీర అంటూ!

మరోసారి చీర వివాదంపై ఘాటుగా స్పందించిన అనసూయ.. శివాజీ సృష్టించిన చీర అంటూ!
Advertisement

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం  తనకు సంబంధించిన విషయాల గురించి మాత్రమే కాకుండా,  ఇండస్ట్రీలో జరుగుతున్న అంశాల గురించి అలాగే మహిళలకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తుంటారు. అయితే ఇటీవల నటుడు శివాజీ (Sivaji)మహిళల వస్త్రధారణ గురించి ఓ సినిమా వేడుకలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై అనసూయ (Anasuya)ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో శివాజీ వర్సెస్ అనసూయ అనే విధంగా వివాదం చెలరేగింది.

శివాజీ సృష్టించిన చీర అనే వస్త్రం..

శివాజీ ఒక సినిమా వేడుకలలో మాట్లాడుతూ హీరోయిన్లు బయటకు వచ్చినప్పుడు బట్టలు సరిగ్గా వేసుకోండి అంటూ కొన్ని అభ్యంతరకరమైన పదాలు మాట్లాడటంతో ఈయనపై చాలామంది విమర్శలు కురిపించారు. ఇక ఈ విషయంలో అనసూయ కాస్త ఘాటుగా రియాక్ట్ అవ్వడంతో ఈమె పట్ల కూడా చాలామంది విమర్శలు చేశారు. ఇక ఈ వివాదం ముగిసిపోయిందనుకున్న తరుణంలో మరోసారి అనసూయ శివాజీ చీర వివాదం గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ సంచలనగా మారింది. ఈ నేపథ్యంలోనే అనసూయ తన అధికారిక ఎక్స్ వేదికగా “శివాజీ సృష్టించిన చీర” అంటూ వ్యంగంగా పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

అంతకుముందు మేము చీరలు కట్టుకోలేదా?

Advertisement

ఇటీవల అనసూయ తన భర్తతో కలిసి ఒక ఆలయానికి వెళ్లారు అయితే ఆమె చాలా పద్ధతిగా చీర కట్టుకొని గుడికి వెళ్ళగా ఈ వీడియో క్లిప్ ను ఒక న్యూస్ ఛానల్ ప్రసారం చేస్తూ.. శివాజీ దెబ్బతో పట్టుచీరలో తిరుగుతున్న అనసూయ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే అనసూయ ఈ వీడియోని తన ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ..”తప్పు తప్పు.. శివాజీ సృష్టించిన చీర అనే వస్త్రాన్ని ధరించి తిరుగుతున్న అనసూయ.. ఇది కదా ఉండాలి ఎందుకంటే అంతకుముందు మేమంతా అసలు చీరలే కట్టుకోలేదు.. ఏంటమ్మా పోస్ట్ చేసే ముందు చూసుకోవాలి ” కదా అంటూ తనదైన స్టైల్ లోనే ఈమె కౌంటర్ ఇస్తూ పోస్ట్ చేశారు.

Advertisement

ప్రస్తుతం అనసూయ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .ఇంతకుముందు తాను ఎప్పుడు చీర కట్టుకోలేదని, శివాజీ చెప్పిన తర్వాతనే చీర కట్టుకొని తిరుగుతున్నట్టు మాట్లాడటంతో అనసూయ తనదైన స్టైల్ లోనే ఘాటుగా స్పందిస్తూ చీరను శివాజీని సృష్టించారు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇలా మరోసారి ఈమె శివాజీ పేరును ప్రస్తావిస్తూ చీర గురించి మాట్లాడటంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. మరి ఈ కామెంట్స్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది. ఇలా ఎప్పటికప్పుడు మహిళల వస్త్రధారణ గురించి సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై అనసూయ స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు.

Also Read: ఉస్తాద్ భగత్ సింగ్ డిజాస్టర్..పాపం హరీష్ శంకర్ అంటూ పరువు తీసిన యాంకర్.. ఫీలైన డైరెక్టర్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×