E-Paper
Advertisement

Anaganaga Oka Raju: రిలీజ్‌కు ముందే పోలిశెట్టి సినిమాకు లాభాలు.. సేఫ్ జోన్‌లో నిర్మాత నాగవంశీ

Anaganaga Oka Raju: రిలీజ్‌కు ముందే పోలిశెట్టి సినిమాకు లాభాలు.. సేఫ్ జోన్‌లో నిర్మాత నాగవంశీ
Advertisement

Anaganaga Oka Raju : నవీన్ పోలిశెట్టి , మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం అనగనగా ఒక రాజు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ,వెడ్డింగ్ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో  పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇక ఈ సినిమాకు సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో బిజినెస్ కూడా పూర్తి చేసుకుందని తెలుస్తోంది.

నాన్ థియెట్రికల్ బిజినెస్..

ఈ సినిమా నాన్ థియెట్రికల్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగినట్టు తెలుస్తోంది. ఇలా నాన్ థియెట్రికల్ బిజినెస్ ద్వారానే అనగనగా ఒక రాజు సినిమా లాభాల బాటలోకి వెళ్లిందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం 25 నుంచి 30 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించారని, అయితే నాన్ థియెట్రికల్ బిజినెస్ ద్వారా 27 కోట్ల రూపాయలను రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను రూ.19 కోట్లకు నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకున్నారు. ప్రముఖ సాటిలైట్ సమస్థ జీ  తెలుగు ఈ సినిమా శాటిలైట్ హక్కులను రూ.5 కోట్లకు కొనుగోలు చేయగా, ఆడియో రైట్స్ ద్వారా రూ.3 కోట్లకు అమ్ముడు పోయాయి. ఇలా నాన్ థియెట్రికల్ ద్వారా ఈ సినిమాకు మొత్తం రూ.27 కోట్లు వరకు లాభాలు వచ్చాయని తెలుస్తుంది.

లాభాలలో అనగనగా ఒక రాజు..

Advertisement

గత కొంతకాలంగా వరుస సినిమాల ద్వారా నష్టాలను ఎదుర్కొంటున్న నాగ వంశీ ఈ సినిమా విషయంలో మాత్రం విడుదలకు ముందే లాభాలను అందుకొని సేఫ్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా స్థాయిలోనే జరిగిందని తెలుస్తుంది. ఇలా ఈ సినిమా విడుదలకు ముందే లాభాలను అందుకోవడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది.

వాయిదా పడ్డ ట్రైలర్..

Advertisement

ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ అప్డేట్స్ మాత్రం సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమా నుంచి నేడు ట్రైలర్ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ రేపు ఉదయం 10 గంటలకు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ఇక మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నేపథ్యంలో ఈ సినిమాపై మంచి అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈమె గత ఎడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

Also Read: The Raja Saab -MSVPG: ఏపీలో ప్రభాస్, చిరు సినిమాలకు పెరిగిన ప్రీమియర్ టికెట్ ధరలు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×