// // RTC X Road - ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ కి వస్తున్న మల్టీప్లెక్స్‌లు.. -->
E-Paper
Advertisement

RTC X Road: మూవీ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ కి వస్తున్న మల్టీప్లెక్స్‌లు, త్వరలోనే గ్రాండ్‌ లాంచ్‌

RTC X Road: మూవీ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ కి వస్తున్న మల్టీప్లెక్స్‌లు, త్వరలోనే గ్రాండ్‌ లాంచ్‌
Advertisement

RTC  X Road: హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ (RTC X Road) అంటే ఒకప్పుడు ఎంటర్‌టైన్మెంట్‌కి కేరాఫ్‌. అక్కడ ఎన్నో థియేటర్లు వెలిశాయి. 80′s,90’s సినిమా చూడలంటే ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌కే వెళ్లాలని. సంధ్య, దేవి, సుదర్శన్‌ థియేటర్లలకు దశాబ్దాల చరిత్ర ఉంది. అయితే ఇప్పటి వరకు అక్కడ మల్టీప్లెక్స్‌, పీవీఆర్‌ లేకపోవడం గమనార్హం. ఒకప్పుడు ఎంటర్‌ట్రైన్‌మెంట్‌కి కేరాఫ్‌గా ఉన్న ఈ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌కి ఇప్పుడు మల్టీప్లెక్స్‌ రాబోతున్నాయి. అక్కడ త్వరలో పలు మల్టీప్లెక్స్‌ థియేటర్లు ప్రారంభం కాబోతున్నాయి.

Advertisement

ఓడియోన్‌ మల్టీప్లెక్స్‌ (Odeon Multiplex) చైన్‌ థియేటర్ల్‌ త్వరలోనే అక్కడ ఘనంగా ప్రారంభం కాబోతోంది. అక్టోబర్‌ 24న ఈ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించబోతున్నారు. అలాగే మహేష్‌ బాబు ఎఎమ్‌బీ మాల్‌ కూడా ఆర్టీసీకి రాబోతోంది. AMB classic 7 పేరుతో అక్కడ మహేష్‌ బాబు మల్టీప్లెక్స్‌ ప్రారంభం కాబోతోంది. సంధ్య, సుదర్శన్‌, దేవి థియేటర్ల వంటి వివిధ థియేటర్లతో ఇప్పటి వరకు అక్కడ 18 థియేటర్లలో ఉన్నాయి. ఇప్పుడు ఎఎంబీ, ఓడియోన్‌తో అక్కడ థియేటర్ల సంఖ్య 20కి పెరగనుంది.

8 స్క్రీన్లతో ఓడియోన్‌ మల్టీప్లెక్స్‌

ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో ఇప్పటి వరకు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు మాత్రమే ఉన్నాయి. ఓడియోన్‌, ఎఎమ్‌బీ క్లాసిక్‌తో అక్కడ మల్టీప్లెక్స్ రాబోతున్నాయి. అక్టోబర్‌ 24న విడుదల కాబోయే ఒడియోన్‌ మల్టీప్లెక్స్‌ అత్యాధిక టెక్నాలజీ, అన్ని హంగులతో ప్రారంభోత్సవం జరగబోతుంది. దాదాసు 8 స్క్రీన్లతో ఈ థియేటర్‌ను నిర్మించారట. ఇప్పటి వరకు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు మాత్రమే ఉన్న ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోకి మల్టీప్లెక్స్‌ రాబోతుండటంతో మూవీ లవర్స్‌ అంత ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు.

ఏఎంబీ క్లాసిక్‌ (AMB classic)

Advertisement

ఓడియోన్‌తో పాటు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఏఎంబీ మాల్‌ కూడా ఆర్టీసీకి రాబోతోంది. AMB classic పేరుతో దాదాపు 7 స్క్రిన్లతో ఈ మల్టీప్లెక్స్‌ నిర్మిస్తున్నారట. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ మల్టీప్లెక్స్‌ వచ్చే ఏడాది 2026 జనవరిలో గ్రాండ్‌గా ఒపెన్‌ చేయబోతున్నారు. ఇక నగరంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకి సంబంధించి ఇది రెండో థియేటర్‌ కావడం విశేషం. కొన్ని నెలల వ్యవధిలోనే ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ రెండు మల్టీప్లెక్స్‌ వస్తుండటంతో సినీ అభిమానులంత పండగ చేస్తున్నారు. అయితే కాంపిటేషన్‌కి అడ్డాగా ఉన్న ఆర్టీసీకి మల్టీప్లెక్స్‌ వస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తున్న విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.

మూవీ థియేటర్లకు కేరాఫ్‌ అడ్రసగా ఉన్న ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ ప్రస్తుతం కాంపిటేషన్‌ ఫీల్డ్‌కి అడ్డగా మారింది. అక్కడ ఎన్నో కాంపిటిషన్‌ ఇన్‌స్ట్యూట్స్‌ వెలిశాయి. ఆర్‌సీ రెడ్డి వంటి ప్రముఖ సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌ అక్కడే ఉంది. దీంతో ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ స్టూడెంట్స్‌కి అడ్డాగా మారింది. అయితే ఇప్పుడ ఈ క్రాస్‌ రోడ్‌లోకి మల్టీప్లెక్స్‌ రావడంతో ఇది యూటర్న్‌ తీసుకుని ఎంటర్‌టైన్మెంట్‌గా అడ్డాగా మారుతుందా? అని కోచింగ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ యాజమాన్యం ఆందోళన చెందుతున్నాయి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×