E-Paper
Advertisement

Allu Sirish: భార్య నైనిక పేరును  టాటూగా వేయించుకున్న శిరీష్.. ఇది కదా ప్రేమంటే?

Allu Sirish: భార్య నైనిక పేరును  టాటూగా వేయించుకున్న శిరీష్.. ఇది కదా ప్రేమంటే?
Advertisement

Allu Sirish: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్న అల్లు శిరీష్(Allu Sirish) ఇటీవల తన ప్రేయసి నైనిక రెడ్డి(Nainika Reddy)తో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ మార్చి6వ తేదీ కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి బంధంతో  ఒక్కటయ్యారు. ఇలా వీరి పెళ్లి వేడుకలు పూర్తి కావడంతో అల్లు శిరీష్ తన పెళ్లి వేడుకకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. తాజాగా ఈయన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

శిరీష్ చేతిపై నైనిక పేరు…

ఈ నేపథ్యంలోనే అల్లు శిరీష్ తన మెహందీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు ఇందులో భాగంగా నైనిక తన చేతులకు గోరింటాకు పెట్టుకుని ఉండగా శిరీష్ తన భుజంపై చేయి వేసి ఉన్న ఫోటోని షేర్ చేశారు అయితే అల్లు శిరీష్ తన చేతి పై నయనిక  పేరును తెలుగులో మెహేందితో డిజైన్ చేయించుకున్నారు .ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటోని షేర్ చేసిన శిరీష్ నా పెళ్లి వేడుకలో మోస్ట్ ఫేవరెట్ మూమెంట్ అంటూ ఈ ఫోటోలను షేర్ చేశారు.

మొదటి పరిచయం అక్కడే..

Advertisement

ఈ విధంగా శిరీష్ నయనిక పేరును టాటూగా వేయించుకోవడంతో తన పట్ల ఈయనకు ఎంత ప్రేమ ఉందో స్పష్టమవుతుంది. ఇక ఈ పోస్టుపై అభిమానులు స్పందిస్తూ విభిన్న రీతిలో కామెంట్ చేస్తున్నారు. ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు ఇది కదా అసలైన ప్రేమ అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇక శిరీష్ నైనిక ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కదా రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా బ్యాచిలర్ పార్టీలో మొదటిసారి నైనిక తనకు పరిచయమైందని శిరీష్ తెలిపారు.

Advertisement

ఇలా మొదలైన మా పరిచయం మంచి స్నేహితులుగా మారామని ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నామని తెలిపారు. ఇక నైనిక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి కాకుండా పారిశ్రామికవేత్త కుమార్తె అని తెలుస్తోంది. ఇక అల్లు శిరీష్ తమ కుటుంబంలో చిన్నవాడు కావడంతో శిరీష్ వివాహపు వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక శిరీష్ కెరియర్ విషయానికి వస్తే ఈయన గౌరవం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. ఇప్పటివరకు పలు సినిమాలలో నటించిన సిరీస్ మాత్రం సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు ఈయన చివరిగా 2024లో బడ్డీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత ఎలాంటి కొత్త సినిమాలను శిరీష్ ప్రకటించలేదు.

Also Read: Allu Cinemas: అల్లు సినిమాస్ గ్రాండ్ లాంచ్ ముహూర్తం ఫిక్స్.. థియేటర్ ప్రత్యేకతలు ఇవే!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×