E-Paper
Advertisement

Allu Sirish: అల్లు శిరీష్ పెళ్లి కొడుకు ఫంక్షన్.. స్పెషల్ అట్రాక్షన్ గా విజయ్ – రష్మిక జంట.. వీడియో వైరల్!

Allu Sirish: అల్లు శిరీష్ పెళ్లి కొడుకు ఫంక్షన్.. స్పెషల్ అట్రాక్షన్ గా విజయ్ – రష్మిక జంట.. వీడియో వైరల్!
Advertisement

Allu Sirish:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు ఏడడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత ఎనిమిది సంవత్సరాల పాటూ రహస్యంగా తమ ప్రేమను కొనసాగిస్తూ.. ఎట్టకేలకు ఫిబ్రవరి 26 2026న ఉదయపూర్ లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika mandanna) వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. అయితే ఈ జంట ఇప్పుడు మరో జంట పెళ్లి వేడుకకు హాజరు కావడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఘనంగా అల్లు శిరీష్ పెళ్ళికొడుకు వేడుక..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ ఏడాది పెళ్లి భాజాలు మోగుతున్నాయి. విజయ్ – రష్మిక పెళ్లి తర్వాత మరో జంట పెళ్లికి సిద్ధమయ్యింది. వారెవరో కాదు ప్రముఖ హీరో అల్లు శిరీష్ (Allu Sirish), ఆయన ప్రేయసి నయనికా రెడ్డి(Nayanika Reddy) దాదాపు రెండు సంవత్సరాల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. గత ఏడాది కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక ఈ ఏడాది వివాహానికి సిద్ధమయ్యారు. మార్చి 6వ తేదీన అంగరంగ వైభవంగా హైదరాబాదులోనే వివాహం జరగనుంది. ఇకపోతే ఈ ఏడాది జనవరి 30, 31న దుబాయ్ లోని యాచ్లో సన్నిహితులు, కుటుంబ సభ్యులకు అల్లు శిరీష్ ప్రత్యేకంగా పార్టీ ఇచ్చారు. అలాగే అల్లు అర్జున్ (Allu Arjun)కూడా సినీ సెలబ్రిటీలకు ప్రైవేట్ పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే.

స్పెషల్ అట్రాక్షన్ గా కొత్తజంట..

Advertisement

తాజాగా అల్లు శిరీష్ ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. అందులో భాగంగానే పసుపు దంచే కార్యక్రమం పూర్తవగా.. ఇప్పుడు పెళ్లి కొడుకు చేసే తంతు కూడా పూర్తయింది. అందుకు సంబంధించిన వీడియోని అల్లు శిరీష్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ..”ఎట్టకేలకు నేను పెళ్లి కొడుకుని అయిపోయాను.. పెళ్లికి సిద్ధంగా ఉన్నాను” అంటూ షేర్ చేశారు. ఇకపోతే అల్లు శిరీష్ షేర్ చేసిన ఈ పెళ్లి కొడుకు ఫంక్షన్ వీడియోలో కొత్తగా పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. పెళ్లైన రెండు రోజుల్లోనే అల్లు శిరీష్ పెళ్లి కొడుకు ఫంక్షన్ లో కనిపించి అందరిని ఆకట్టుకున్నారు.

ALSO READ:Rashmika – Vijay: పెళ్లైన 2 రోజులకే సెట్ పైకి.. “మేడ్ ఫర్ ఈచ్ అదర్” అంటూ!

ఆకట్టుకున్న ఉపాసన – రామ్ చరణ్ జంట..

Advertisement

ఇకపోతే వీరితోపాటు మరో జంట కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది . వారే ఉపాసన (Upasana) రామ్ చరణ్(Ram Charan).. ఉదయాన్నే టిఫిన్, కాఫీలు తాగుతూ రాంచరణ్ సందడి చేయగా.. అటు ఉపాసన కూడా కాస్త బొద్దుగా కనిపించి మరింతగా ఆకట్టుకుంది. మొత్తానికి అయితే అటు రష్మిక – విజయ్ దేవరకొండ ఇటు రాంచరణ్ – ఉపాసన దంపతులు అల్లు శిరీష్ పెళ్లి కొడుకు వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇకపోతే అల్లు అర్జున్ ఆయన సతీమణి అల్లు స్నేహారెడ్డి కూడా సందడి చేశారు. ప్రస్తుతం ఈ అల్లు శిరీష్ పెళ్లి కొడుకు ఫంక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×