E-Paper
Advertisement

Allu Sirish: కాబోయే భార్యపై అల్లు శిరీష్ ముద్దుల వర్షం.. క్యూట్ వీడియో షేర్ చేసిన శిరీష్!

Allu Sirish: కాబోయే భార్యపై అల్లు శిరీష్ ముద్దుల వర్షం.. క్యూట్ వీడియో షేర్ చేసిన శిరీష్!
Advertisement

Allu Sirish: అల్లు శిరీష్ అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇలా అల్లు శిరీష్ (Allu Sirish)పెళ్లి వేడుకలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అల్లు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. అల్లు చిన్న వారసుడిగా కొనసాగుతున్న శిరీష్ మరి కొద్ది రోజులలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు.. 2025 అక్టోబర్ 31వ తేదీ అల్లు శిరీష్ నైనిక రెడ్డి(Nainika Reddy) నిశ్చితార్థపు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు పలువురు సినీ సెలబ్రిటీల సమక్షంలో ఈ నిశ్చితార్థపు వేడుక జరిగింది. ఇలా గత ఏడాది నిశ్చితార్థ జరుపుకున్న ఈ జంట మార్చి ఆరో తేదీ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు.

మొదలైన అల్లు వారి పెళ్లి సందడి..

ఇక వీరి పెళ్లికి సరిగ్గా నెలరోజుల సమయం ఉన్న నేపథ్యంలో వీరి పెళ్లి వేడుకలు ప్రారంభం అయ్యాయి ఇప్పటికే అల్లు అర్జున్ అల్లు శిరీష్ తమ సన్నిహితులతో కలిసి దుబాయిలో ఎంతో ఘనంగా బ్యాచిలర్ పార్టీని జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ బ్యాచిలర్ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను అల్లు శిరీష్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ స్నేహ రెడ్డితో పాటు తన స్నేహితులందరితో ఎంజాయ్ చేస్తూ ఈ వేడుకను జరుపుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ వేడుకను ఒక పడవలో సెలబ్రేట్ చేసుకున్నట్టు ఈ వీడియో చూస్తేనే స్పష్టం అవుతుంది.

దుబాయ్ లో బ్యాచిలర్ పార్టీ..

Advertisement

ఈ వీడియోలో భాగంగా అల్లు శిరీష్ తనకు కాబోయే భార్య నైనిక రెడ్డి పై పెద్ద ఎత్తున ప్రేమను కనబరుస్తూ ఆమెపై ముద్దుల వర్షం కురిపించారు. ఇలా నైనిక అల్లు శిరీష్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ముందుగానే ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దంపతులు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రస్తుతం అల్లు శిరీష్ తన పెళ్లి పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

?igsh=MWhxZTQ2ajVqdXF2eg==

Advertisement

ఇక వీరి వివాహం మార్చి ఆరవ తేదీ ఎంతో ఘనంగా జరగబోతోంది. ఇంకా పెళ్లికి సంబంధించిన వివరాలను అల్లు కుటుంబం ఎక్కడ అధికారకంగా వెల్లడించలేదు.. ఇకపోతే అల్లు అర్జున్, స్నేహ రెడ్డి పెళ్లి చేసుకున్న రోజే అల్లు శిరీష్, నైనిక రెడ్డిల వివాహం జరుగుతుండటం విశేషం.. ఇక అల్లు శిరీష్ నైనికది కూడా ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇక అల్లు శిరీష్ కెరియర్ విషయానికి వస్తే ఈయన హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చి పలు సినిమాలలో నటించారు కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. ఇండస్ట్రీలో సక్సెస్ కోసం అల్లు శిరీష్ మాత్రం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారనే చెప్పాలి.

Also Read: Amardeep Chowdary: ఆడిషన్ కి వెళ్తే ఛీ కొట్టారు.. సింపతి డ్రామాలు కాదంటూ అమర్ దీప్ ఎమోషనల్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×