// // Allu Sirish - అల్లు శిరీష్‌ నిశ్చితార్థం తేదీ ఫిక్స్‌.. ఏ రోజంటే! -->
E-Paper
Advertisement

Allu Sirish: అల్లు శిరీష్‌ నిశ్చితార్థం తేదీ ఫిక్స్‌.. ఏ రోజంటే!

Allu Sirish: అల్లు శిరీష్‌ నిశ్చితార్థం తేదీ ఫిక్స్‌.. ఏ రోజంటే!
Advertisement

Allu Sirish Engagement: అల్లు ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోగునున్న సంగతి తెలిసిందే. అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ తనయుడు, హీరో అల్లు శిరీష్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన నయనికను త్వరలోనే పెళ్లాడబోతున్నాడు. ఇటీవల తన పెళ్లి కబురు కూడా చెప్పాడు శిరీష్‌. కాబోయే భార్య చేతిని పట్టుకుని ఉన్న ఫోటో షేర్‌ చేస్తూ పెళ్లి చేసుకోబోతున్నట్టు ఈ నెల ప్రారంభంలో ప్రకటించాడు. కానీ, పెళ్లి ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు. అయితే ఈ అక్టోబర్‌ చివరిలో శిరీష్‌, , నయనికల నిశ్చితార్థం ఉందనే విషయం తెలిసిందే. అక్టోబర్ 31న ఎంగేజ్మెంట్ జరగనుంది.  అయితే తాజాగా శిరీష్‌-నయనికల నిశ్చితార్థం ముహుర్తం తేదీ ఇదేనంటూ సోషల్‌ మీడియాలో మరో వార్త వైరల్‌ అవుతుంది.

నవంబర్ 1న

Advertisement

నవంబర్‌ 1న శిరీష్‌, నయనికల ఎంగేజ్‌మెంట్‌ తేదీ ఫిక్స్‌ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా అక్టోబర్‌ 31న నిశ్చితార్థంకు ముహుర్తం ఫిక్స్ అయిందంటూ స్వయంగా శిరీష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎంగేజ్మెంట్ తేదీ మారిందంటున్నారు. నవంబర్‌ 1కి ముహుర్తం తేదీ మారినట్టు సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా మెగా–అల్లు హీరోలంత ఒక్కొక్కరిగా వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. రెండేళ్ల క్రితం వరుణ్‌ తేజ్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకుని ఇటీవల తండ్రి కూడా అయ్యాడు. ఇలా వరుసగా మెగా–అల్లు హీరోలు పెళ్లి పీటలు ఎక్కుతుండటంతో అల్లు శిరీష్‌ పెళ్లి కూడా ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఊహించని విధంగా గుడ్ న్యూస్

ఈ అల్లు హీరో ఎప్పుడెప్పుడు గుడ్‌న్యూస్‌ చెబుతాడా అని అభిమానులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఊహించని విధంగా గుడ్‌న్యూస్‌ చెప్పాడు. తాను త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్టు కాబోయే భార్య చేయి పట్టుకుని దిగిన ఫోటో షేర్‌ చేస్తూ గుడ్‌న్యూస్‌ చెప్పాడు. కాగా అల్లు రామలింగయ్య సతీమణి, అల్లు అరవింద్‌ తల్లి మరణించిన కొన్ని రోజులకే ఈ శుభవార్త చెప్పాడు. అక్టోబర్‌ 31న తన ఎంగేజ్‌మెంట్‌ తేదీ ఫిక్స్‌ అయినట్టు వెల్లడించాడు. దీంతో మెగా–అల్లు ఫ్యాన్స్‌ అంత ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. తన తాతయ్య అల్లు రామలింగ్య గారి బర్త్ యానివర్సిలోనే తన ఎంగేజ్‌మెంట్‌ జరగడం ఆశీర్వాదంగా భావిస్తున్నట్టు చెప్పాడు.

హైదరాబాద్ అమ్మాయితోనే

Advertisement

కానీ, తన కాబోయే భార్యను ఎవరనేది మాత్రం చెప్పలేదు. కానీ, కాబోయే భార్యది హైదరాబాదే అని, ప్రముఖ వ్యాపారవేత్త కూతురని సమాచారం. ఆమె పేరు నయనిక అనే ప్రచారం కూడా జరుగుతుంది. అంతేకాదు ఇటీవల దీపావళి పండుగను అల్లు ఫ్యామిలీ కాబోయే కొత్త కోడలితో కలిసి సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అల్లు స్నేహా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో నయనిక ఫోటో వైరల్‌ అయ్యింది. అయితే పోస్ట్‌ చేసిన కాసేపటికి నయనికను హైడ్‌ చేస్తూ ఫోటో ఎడిట్ చేసింది స్నేహా. దీంతో శిరీష్‌ కాబోయే భార్య ఆమె అని అంత ఫిక్స్‌ అయిపోయారు. అల్లు కొత్త కోడలు ఈమేనే అంటూ ఆ ఫోటోని షేర్ చేస్తూ ప్రచారం మొదలెట్టారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×