// // Allu Shirish- అల్లు ఫ్యామిలీతో శిరీష్‌ కాబోయే భార్య.. ఫోటో వైరల్ -->
E-Paper
Advertisement

Allu Shirish: అల్లు ఫ్యామిలీతో శిరీష్‌ కాబోయే భార్య.. ఫోటో షేర్ చేసి అంతలోనే దాచేసిన స్నేహా!

Allu Shirish: అల్లు ఫ్యామిలీతో శిరీష్‌ కాబోయే భార్య.. ఫోటో షేర్ చేసి అంతలోనే దాచేసిన స్నేహా!
Advertisement

Allu Sirish Fiance Photo Viral: అల్లు ఫ్యామిలీలో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్‌ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల తన పెళ్లిని ప్రకటిస్తూ ఈ నెల 31న నయనికను నిశ్చితార్థం చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆమె చేయి పట్టుకుని ఉన్న ఫోటోని షేర్‌ చేశాడు. కానీ, ఆమె ఎవరనేది చూపించలేదు. దీంతో అల్లు వారి కాబోయే కోడలు ఎలా ఉంటుంది.. ఆమె ఎవరనేది ఆసక్తిగా మారింది.

కొత్త కోడలితో దీపావళి సెలబ్రేషన్స్

Advertisement

నిన్న దీపావళి సందర్భంగా అల్లు ఫ్యామిలీ అంత ఒక్కట చోట చేరి పండుగను సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యామిలీతో దిగిన ఫోటోలను శిరీష్‌ వదిన, అల్లు అర్జున్‌ భార్య అల్లు స్నేహా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. బన్నీ, తన పిల్లలు అల్లు అయాన్‌, అర్హలతో కలిసి దిగిన ఫోటోలు, క్రాకర్స్‌ కాలుస్తున్న ఫోటోలు వీడియోలను షేర్‌ చేసింది. అలాగే అల్లు కుటుంబమంత కలిసి తీసుకున్న ఫ్యామిలీ ఫోటోని కూడా జతచేసింది. అయితే ఇందులో అల్లు అరవింద్‌ సతీసమేతంగా కనిపించాడు. ఆయన భార్య, ముగ్గురు పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లతో ఆనందంగా కనిపించాడు. అయితే ఈ ఫోటోల్లో ఓ కొత్త మనిషి కనిపించారు. దీంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది. దీంతో ఈమె శిరీష్‌ కాబోయే భార్య అని ఫిక్స్‌ అయ్యారు. ఎందుకంటే ఫోటోల్లో అల్లు అర్జున్‌ తన భార్య స్నేహతో, అల్లు బాబీ తన భార్యతో కనిపించాడు.

ఫోటో షేర్‌ చేసిన అల్లు స్నేహ

ఇక్కడ ఈ అమ్మాయి శిరీష్‌ పక్కన కూర్చోని ఉంది. దీంతో ఈమె శిరీష్‌ కాబోయే భార్య అని తెలిసిపోయింది. దీపావళి సెలబ్రేషన్స్‌ అంటూ ఫ్యామిలీ ఫోటో షేర్‌ చేసిన అల్లు స్నేహా కాసేపటికీ అసలు విషయం గుర్తించినట్టు ఉంది. అందుకే శిరీష్‌ కాబోయే భార్యను ఫోటో నుంచి కాస్తా హైడ్‌ చేసింది. ఫోటోని కాస్తా పక్కకు జరిపి కొత్త కోడలు కనిపించకుండ దాచేసింది. అల్లు ఫ్యామిలీ ఇంకా కొత్త కోడలిని అధికారికంగా ప్రకటించని విషయం తెలిసిందే. అది గుర్తించిన స్నేహా వెంటనే ఫోటోని హైడ్‌ చేసింది. అయితే అప్పటికే ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్‌ వాటిని డౌన్‌లోడ్‌ చేశారు. అల్లు ఫ్యామిలీ కాబోయే కోడలితో అంటూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. అల్లు శిరీష్‌ కాబోయే భార్య ఎవరనేది అందరికి రివీల్‌ అయిపోయింది.

Advertisement

Also Read: Bigg Boss 9 Nominations: ఆయేషా సేవ్‌.. నామినేషన్‌లో మొత్తం 8 మంది, ఎవరెవరంటే..!

ఈ నెల 31న నిశ్చితార్థం

ఇందులో వీరిద్దరి చూసి క్యూట్‌ కపుల్, జంట చూడముచ్చటగా ఉంది, మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. స్నేహా పడ్డ కాస్తా తొందరపాటు అల్లు వారి కొత్త కోడలు ఫోటో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా శిరీష్‌ గత నెలలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ కి చెందిన నయనికతో కొంతకాలంగా శిరీష్‌ ప్రేమలో ఉన్నాడట. వీరిద్దరి పెళ్లికి రెండు కుటుంబాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పెళ్లికి రెడీ అయ్యారు. ఈ నెల 31న వీరి నిశ్చితార్థం ముహుర్తం కూడా ఫిక్స్‌ అయ్యింది. అప్పుడే కోడలిని అల్లు ఫ్యామిలీ అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకుంది. కానీ అంతలో స్నేహా నెట్టింట లీక్ చేసేసింది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×