E-Paper
Advertisement

పుష్ప-2 ఎఫెక్ట్..సంధ్య థియేటర్ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన అల్లు అర్జున్

పుష్ప-2 ఎఫెక్ట్..సంధ్య థియేటర్ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన అల్లు అర్జున్
Advertisement

Allu Arjun: అల్లు అర్జున్ . .పుష్ప సినిమాతో  నేషనల్ వైడ్ గా సత్తా చాటిన బన్నీ అదే సినిమా విషయంలో జరిగిన ఇష్యూ తో కటకటాల పాలయి బయటకొచ్చిన సంగతి తెల్సిందే.ఇక  తాజాగా ఇదే విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు విచారణకు హాజరయ్యారు. అయితే ఆయన భౌతికంగా కోర్టు కి అటెండ్ అవకుండా, ముంబై నుంచి డిజిటల్ స్క్రీన్ ద్వారా న్యాయమూర్తి ముందు అటెండ్ అయ్యాడని సమాచారం.

గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ‘పుష్ప-2: ది రూల్’ సినిమా ప్రీ-రిలీజ్ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రముఖ సంధ్యా థియేటర్ వద్ద ఊహించని విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బన్నీని ఒక్కసారిగా చూసేందుకు అభిమానులు వేలాదిగా తరలిరావడంతో అక్కడ తీవ్ర తొక్కిసలాట జరిగి, ఓ మహిళా అభిమాని ప్రాణాలు కోల్పోగా, ఆమె చిన్నారి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ దురదృష్టకర ఘటనపై స్థానిక పోలీసులు నమోదు చేసిన కేసు విచారణలో భాగంగా, తాజాగా నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది.

Advertisement

also read :Kissik Talks Show: ఒకే ఒక్క రీల్‌తో ఓవర్‌నైట్ స్టార్.. నా టైం వచ్చింది అంటూ ‘స్నో అక్క’ మౌనిష సెన్సేషనల్ కామెంట్స్!

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు గ్రీన్ సిగ్నల్

ఈ ఆదేశాల ప్రకారం ఆయన సోమవారం నాడే కోర్టుకు రావాల్సి ఉండగా, తనకున్న ముందస్తు సినిమా షూటింగ్ షెడ్యూల్స్ మరియు ప్రమోషనల్ అగ్రిమెంట్స్ కారణంగా హైదరాబాద్ రావడం సాధ్యం కాదని బన్నీ తరపు లీగల్ టీమ్ కోర్టుకు విన్నవించింది. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో రాకా సినిమా షూటింగ్ కోసం ముంబై (బాంబే) లోనే మకాం వేశారు. కోర్టు సమయాన్ని గౌరవిస్తూనే, తన ప్రొఫెషనల్ లైఫ్‌కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఒక ప్రత్యేక పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం  న్యాయప్రక్రియను వేగవంతం చేసేందుకు సానుకూలంగా స్పందిస్తూ బన్నీకి వీడియో కాన్ఫరెన్స్ (VC) ద్వారా హాజరయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కోర్టు విచారణలో పాల్గొన్న అల్లు అర్జున్ 

Advertisement

కోర్టు అనుమతితో ముంబై నుంచే  డిజిటల్ లింక్ ద్వారా నాంపల్లి కోర్టు విచారణలో అల్లు అర్జున్ పాల్గొన్నారు. న్యాయమూర్తి అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఎంతో హుందాగా, ఓపిగ్గా సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ప్రమాదం తనను ఎంతగానో కలచివేసిందని, బాధితుల కుటుంబాలకు ఇప్పటికే తన వంతుగా నైతిక, ఆర్థిక మద్దతు అందించానని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

also read :Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

ఊపిరి పీల్చుకున్న బన్నీ ఫ్యాన్స్

భవిష్యత్తులో ఇలాంటి భారీ ఈవెంట్లు జరిగినప్పుడు కచ్చితంగా ముందస్తు భద్రతా చర్యలు తీసుకునేలా చూస్తామని, చట్టానికి మరియు న్యాయవ్యవస్థకు తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. 2021లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ సాధించిన సంచలన విజయం తర్వాత, మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం వచ్చిన పార్ట్-2 థియేటర్ల వద్ద ఎలాంటి బీభత్సం స్ప్రుష్టించిందో చెప్పక్కర్లేదు.అదే స్థాయిలో ఈ వివాదం కూడా అల్లు అర్జున్ కెరీర్‌లో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది.. తాజా పరిణామాలతో అల్లు అర్జున్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారనే చెప్పాలి

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×