E-Paper
Advertisement

మీమ్స్ రాజాలకి మైండ్ బ్లాక్.. బన్నీ పేరు వాడితే 72 గంటల్లో ఖతం!

మీమ్స్ రాజాలకి మైండ్ బ్లాక్.. బన్నీ పేరు వాడితే 72 గంటల్లో ఖతం!
Advertisement

Allu Arjun :ఈ డిజిటల్ యుగంలో డీప్‌ఫేక్ టెక్నాలజీ మరియు కృత్రిమ మేధ (AI)ని అడ్డం పెట్టుకొని సెలబ్రిటీల పరువు, ప్రతిష్టలకి భంగం కలిగిస్తున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఇప్పటికే మా వ్యక్తిత్వ హక్కులని కాపాడండి అంటూ ఆ మధ్య రజినీ, అమితాబ్, అనిల్ కపూర్ వంటి వారు ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కగా తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా వారి బాటలోనే నడిచిన సంగతి తెల్సిందే.

72 గంటల్లోగా ఇంటర్నెట్ నుండి తీసేయకపోతే

Advertisement

బన్నీ కష్టపడి సంపాదించుకున్న బ్రాండ్ ని మొబైల్ యాప్‌లు, ఈ-కామర్స్ వెబ్‌సైట్లు తమ లాభం కోసం వాడుకుంటున్నాయని ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించగా తాజాగా ఈ కేసులో జడ్జ్మెంట్ ఇచ్చింది ఢిల్లీ హైకోర్ట్.అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండా ఆయన పేరు, ఫోటోలు, గొంతు, సిగ్నేచర్ స్టైల్స్ మ్యానరిజమ్స్ ఇలా ఏవీ కమర్షియల్ గా వాడుకోవద్దు అంటూ 2024 అక్టోబర్ 21 న జస్టిస్ తుషార్ రావు గెడెల ధర్మాసనం చెప్పిన జడ్జ్మెంట్ ప్రకారం తేల్చి చెప్పింది. కోర్టు తీర్పునిస్తూ అల్లు అర్జున్ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ఉన్న మార్ఫింగ్ వీడియోలు, అడల్ట్ మీమ్స్ లేదా ఆయన పేరుతో ప్రజలను మోసం చేసే కంటెంట్‌ను ఇలా ఏదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ లో ఉండకూడదంటూ గట్టి వార్నింగే ఇచ్చింది.ఎవరైనా 72 గంటల్లోగా ఇంటర్నెట్ నుండి తీసేయకపోతే మాత్రం కటకటాలు లెక్కించాల్సిందే అంటూ తేల్చి చెప్పింది.

also read :రిటైర్డ్ జైలర్ ఈసారి గ్లోబల్ వార్.. జైలర్ 2 లో ఊహించని ట్విస్టులు!

Advertisement

అమితాబ్,రజినీ, అనిల్ కపూర్ కూడా..

ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన కోర్ట్ తీర్పులని ఎగ్జాంపుల్స్ గా చూపించింది. 2022 నవంబర్ నెలలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫైల్ చేసిన పిటిషన్‌పై కోర్టు తీర్పు ఇస్తూ అమితాబ్ పర్మిషన్ లేకుండా ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ లోగో లేదా ఆయన వాయిస్ వాడకూడదని చెప్పిన తీర్పుని గుర్తు చేసింది.అలాగే 2023 సెప్టెంబర్ నెలలో నటుడు అనిల్ కపూర్ ఫైల్ చేసిన కేసులో కూడా ఆయన సిగ్నీచర్ డైలాగ్ ‘ఝకాస్’ తో సహా ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలపై ఆయనకే పూర్తి రైట్స్ ఉంటాయని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది.ఇక సౌత్ సూపర్ స్టార్ రజనీ కూడా గతంలో మద్రాస్ హైకోర్టు ద్వారా ఇటువంటి ‘పర్సనాలిటీ రైట్స్’ రక్షణను పొందిన వారే. ఇక తాజాగా ఇప్పుడు అదే బాటలో అల్లు అర్జున్ కూడా నిలవడం విశేషం.

జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే

ఏది ఏమైనా క్రేజ్ ని అడ్డం పెట్టుకొని తమ పేరు మీద తప్పుడు ప్రచారాలు చేసి జనాలని మోసగించే వారికి ఇదొక చెంప పెట్టు అని చెప్పకతప్పదు. సో ఇకపై ఎవరైనా బన్నీ ఫోటోలు, గొంతు, సిగ్నేచర్ స్టైల్స్ మ్యానరిజమ్స్ ఇలా ఏవి కమర్షియల్ గా వాడినా జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనన్నమాట!

also read :నెట్‌ఫ్లిక్స్‌లో టిల్లు గాడి రచ్చ.. స్టార్ బాయ్ సిద్ధూతో మీనాక్షి చౌదరి రొమాన్స్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×