E-Paper
Advertisement

Allu Arjun: ఆ విషయంలో ఐకాన్ స్టార్ కొత్త ట్రెండ్..అట్లీ సినిమాకు భారీ రెమ్యూనరేషన్

Allu Arjun: ఆ విషయంలో ఐకాన్ స్టార్ కొత్త ట్రెండ్..అట్లీ సినిమాకు భారీ రెమ్యూనరేషన్
Advertisement

Allu Arjun ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం  వరుస పాన్ ఇండియా సినిమాలో షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి ప్రస్తుతం ఈయన తమిళ దర్శకుడు అట్లీ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ ఉన్న అల్లు అర్జున్(Allu Arjun) అదే స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా అందుకుంటున్నారు.

27% లాభాలలో వాటాలు..

ఇకపోతే తాజాగా అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా కోసం సరికొత్త మార్గాన్ని ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు జరిగిన మొత్తం బిజినెస్ లో ఈయన 27% వాటాను తన రెమ్యునరేషన్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 1000 కోట్లకు పైగా జరగడంతో అల్లు అర్జున్ ఏకంగా 270 నుంచి 300 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది.

Advertisement

300 కోట్ల రెమ్యూనరేషన్ 

ఇలా ఈ సినిమా విషయంలో అనుసరించిన విధానాన్ని బన్నీ తన తదుపరి సినిమాల విషయంలో కూడా అనుసరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈయన రెమ్యూనరేషన్ కాకుండా బిజినెస్ షేరింగ్ పద్ధతిని అనుసరిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ సినిమాతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాని సన్ పిక్చర్ వారు సుమారు 800 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెమ్యూనరేషన్ విషయంలో కూడా అల్లు అర్జున్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.అట్లీ సినిమా కోసం 175 కోట్ల ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ పాటు ఈ సినిమాలలో వచ్చే లాభాలలో 15 శాతం వాటా తీసుకొనే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఈ సినిమా విడుదలైన తర్వాత ఓ మోస్తారు టాక్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ దాదాపు 300 కోట్ల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Advertisement

బన్నీని ఫాలో అవుతున్న స్టార్స్..

ఇక ఈ సినిమా విషయంలో మాత్రమే కాకుండా తదుపరి లోకేష్ కనగరాజ్ తో చేయబోయే సినిమా విషయంలో కూడా బన్నీ ఇదే పద్ధతిని అనుసరించబోతున్నారని తెలుస్తోంది. అయితే రెమ్యూనరేషన్ విషయంలో అల్లు అర్జున్ తీసుకున్న ఈ నిర్ణయం సినిమా సక్సెస్ లో మాత్రమే కాకుండా సినిమా ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు కూడా  ఆ ఇబ్బందులలో కూడా భాగస్వామ్యం కాబోతున్నారనే చెప్పాలి. సినిమాల రెమ్యూనరేషన్ విషయంలో బన్నీ ఫాలో అవుతున్న ఈ విధానం ఇతర హీరోలను కూడా ఆకట్టుకుందని తెలుస్తుంది. మరి ఈయన లాగే ఇతర హీరోలు కూడా  ఈ పద్ధతిని ఫాలో అవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Mumaith Khan: ఏడేళ్లు మంచానికే పరిమితం.. కన్నీళ్లు పెట్టుకున్న ముమైత్ ఖాన్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×