// // Allari Naresh - అల్లరి నరేష్ సినిమాలో అల్లు అర్జున్ - అట్లీ స్టాఫ్.. ఇక మాములుగా ఉండదు! -->
E-Paper
Advertisement

Allari Naresh: అల్లరి నరేష్ సినిమాలో అల్లు అర్జున్ – అట్లీ స్టాఫ్.. ఇక మాములుగా ఉండదు!

Allari Naresh: అల్లరి నరేష్ సినిమాలో అల్లు అర్జున్ – అట్లీ స్టాఫ్.. ఇక మాములుగా ఉండదు!
Advertisement

Allari Naresh Next Movie Update: పుష్ప మూవీతో అల్లు అర్జున్‌, జవాన్‌ మూవీతో అట్లీ పాన్‌ ఇండియా క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరు కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నారు. AA22xA6 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రాన్ని ప్రకటించారు. ప్రస్తుతం మోస్ట్‌ అవైయిటెడ్‌ ఇండియన్‌ చిత్రాల్లో ఈ ప్రాజెక్ట్‌ ఒకటి. రాజమౌళి, మహేష్‌ బాబు SSMB29 మూవీ తర్వాత ఆ రేంజ్‌లో బజ్‌ ఉంది ఈ చిత్రానికే. పాన్‌ వరల్డ్‌గా సైన్స్‌ ఫిక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందబోతోంది. ఈ సినిమాకు నందు సవిరిగాన కథ అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ దెబ్బతో అతడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్‌ వాంటెడ్‌ రైటర్‌గా మారిపోయారు. దీంతో సినీ రచయిత ఈ క్రేజ్‌ ఒక్కసారిగా ప ఎరిగిపోయింది.

జాక్ పాట్ కొట్టిన ‘అల్లరి’ హీరో

Advertisement

ఈ క్రమంలో నందు సవిరిగాన సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. అగ్ర హీరో, అగ్ర దర్శకుడి సినిమాకు వర్క్‌ చేస్తున్న ఆయన ఇప్పుడు ఓ మిడిల్‌ రేంజ్ హీరో సినిమాకు కథ అందించబోతున్నారట. అల్లరి నరేష్‌ ఓ కమెడీ హీరో నుంచి సీరియస్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే అతడు సీరియస్‌ యాక్షన్‌లోకి అడుగుపెట్టి తనని ప్రూవ్‌ చేసుకున్నాడు కూడా. ఉగ్రం, నాంది వంటి చిత్రాలతో యాక్షన్‌ చేసి హిట్‌ కొట్టాడు. అయితే మళ్లీ ఆ ఒక్కటి అడక్కుతో కమెడీ జానర్‌ని నమ్ముకున్నాడు. ఆ తర్వాత బచ్చలి మిల్లి చిత్రంలో సీరియస్‌ రోల్లో కనిపించాడు. కానీ, ఇది పెద్దగా వర్కౌట్‌ కాలేదు.

అల్లరి నరేష్ మూవీకి AA22xA6 స్టాఫ్

దీంతో సినిమాలకు కాస్తా గ్యాప్‌ తీసుకున్న ఈ అల్లరోడి.. ఈసారి భారీ ప్రాజెక్ట్‌ని సిద్ధం చేసుకున్నాడు. అతడు హీరోగా ఓ సోషియో ఫాంటిసి మూవీ రాబోతోంది.  ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ ప్రొడ్‌క్షన్‌ వర్క్‌ కూడా మొదలైంది. ఈ సినిమాకు అల్లు అర్జున్‌-అట్లీ మూవీ రైటరయినా.. నందు సవిరిగాన కథ అందిస్తున్నాడట. ఈ విషయం తెలిసి అంతా సర్‌ప్రైజ్ అవుతున్నారు. అట్లీ,బన్నీ లాంటి పెద్ద సినిమాకు కథ అందించిన ఆయన అల్లరి నరేష్‌ చిత్రానికి స్టోరీ రాయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ మారింది. ఈ అల్లరోడి ఫేట్‌ మామూలుగా లేదని, ఈసారి జాక్‌పాట్‌ కొట్టేశాడంటున్నారు. పాన్‌ వరల్డ్‌ ప్రాజెక్ట్‌కి వర్క్‌ చేసిన రైటర్‌.. అల్లరి నరేష్‌ సినిమాకు కథ అందించడమంటే మామూలు విషయం కాదని, ఈ సారి అల్లరి హీరో ఏదో భారీగా ప్లాన్‌ చేశాడనిపిస్తోంది.

Advertisement

ఈ దెబ్బతో ఈ అల్లరోడు పాన్‌ ఇండియా హీరో అయిపోవడం ఖాయమంటున్నారు. మొత్తానికి కాస్తా గ్యాప్‌ తీసుకున్న.. తమ హీరో బాక్సాఫీసు షేక్‌ చేసేందుకు రెడీ అయ్యాడంటూ ఈ అల్లరోడి ఫ్యాన్స్‌ . మరోవైపు అల్లు అర్జున్‌ తమ్ముడు అల్లు శిరీష్‌ సినిమాకు కూడా నందు సవిరిగాన కథ రాస్తున్నాడట. ఇది కూడా సోషియో ఫాంటిసి బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందట. ఈ విషయంపై ఇటీవల శిరీష్‌ కూడా హింట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా త్వరలోనే ఈ మూవీ దర్శకుడితో పాటు మూవీ విశేషాలపై అధికారిక ప్రకటన రానుంది. కాగా ప్రస్తుతం అల్లరి నరేష్‌ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. 12A రైల్వే స్టేషన్‌, సభకు నమస్కారం, ఆల్కహాల్‌ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు.ఈ ఏడాదిలో వరుసగా ఈ చిత్రాలు రిలీజ్‌ కానున్నాయి.ఆ తర్వాత ఈ సోషియో ఫాంటసి చిత్రాన్ని సెట్‌పైకి తీసుకురాన్నున్నాడట.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×