E-Paper
Advertisement

పుష్ప 2 విషాదం.. శ్రీతేజ్ ని పరామర్శించిన స్నేహరెడ్డి..వీడియో వైరల్ !

పుష్ప 2 విషాదం.. శ్రీతేజ్ ని పరామర్శించిన స్నేహరెడ్డి..వీడియో వైరల్ !
Advertisement

Allu Support: పుష్ప 2 రిలీజ్ టైమ్ లో సంధ్య థియేటర్ ఇష్యూ ఎంత సెన్సేషన్ అయ్యిందో చెప్పక్కర్లేదు.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నా ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో రేవతిప్రాణాలు కోల్పోవడం అందరిని కలిచివేసింది.ఇక అదే ఘటనలో చావు అంచుల దాకా వెళ్ళిన రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం కోలుకుంటున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా కోలుకుంటున్న శ్రీతేజ్ ని పరామర్శించి తమ మానవత్వాన్ని చాటుకుంది అల్లు ఫ్యామిలీ.

బాధిత కుటుంబం వద్దకు అల్లు అరవింద్, స్నేహ రెడ్డి

Advertisement

తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న శ్రీతేజ్ ఇంటికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మరియు అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ రెడ్డి వెళ్లారు. కేవలం పరామర్శించడమే కాకుండా, ఆ కుటుంబంలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. తల్లిని కోల్పోయి, తను కూడా చావు అంచుల దాకా వెళ్లి వచ్చిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అల్లు అరవింద్ స్వయంగా ఆరా తీశారు. “ఏం పర్వాలేదు, మేమున్నాం” అంటూ ఆయన ఇచ్చిన భరోసా ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచింది.

శ్రీతేజ్ సోదరి చదువు బాధ్యత నాదే

Advertisement

ఈ పరామర్శలో అల్లు అరవింద్ గారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీతేజ్ సోదరి భవిష్యత్తు గురించి ఆందోళన చెందవద్దని, ఆమె చదువుకు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని ఆయన హామీ ఇవ్వడం మెచ్చుకోతగ్గ విషయం.”డబ్బుతో పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం, కానీ ఒక బిడ్డ భవిష్యత్తును మాత్రం తీర్చిదిద్దగలం. ఆ అమ్మాయిని ఉన్నత చదువులు చదివించే బాధ్యత నాది అని చెప్పడం బట్టి చూస్తె అల్లు ఫ్యామిలీ ఆ కుటుంబం పట్ల ఎంత కన్సర్న్ చూపిస్తుందో అర్థం అవుతుంది.

also read :ప్రభాస్ ఫౌజీపై టెన్షన్.. మళ్ళీ ‘సలార్’, ‘కల్కి’ రిపీట్ కాబోతోందా?

అసలేం జరిగింది?

డిసెంబర్ 5న ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద భారీగా పోగయ్యారు జనాలు. ఇక అదే సమయంలో
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను చూడాలనే ఉత్సాహంలో జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. అదే సమయంలో శ్రీతేజ్ కూడా కోమాలోకి వెళ్లిపోయాడు. అలా చాలా రోజుల పాటు ఆస్పత్రిలో చావుతో పోరాడి, ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.అలా మొత్తానికి రికవరీ అయిన శ్రీతేజ్ ని ఈరోజు మరోసారి పరామర్శించి భరోసా ఇచ్చింది అల్లు ఫ్యామిలీ.

ఫ్యాన్స్ ప్రశంసలు 

ఇక ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అల్లు అరవింద్ స్వయంగా వెళ్లి, ఆ అమ్మాయి చదువు బాధ్యత తీసుకోవడంతో ఇదీ అల్లు అర్జున్ కమిట్ మెంట్ అంటూ మరోసారి ఆకాశానికి ఎత్తేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్ !

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×