E-Paper
Advertisement

Global Summit 2025: సినిమా రైజింగ్‌ సెషన్‌.. సీఎం రేవంత్‌ రెడ్డితో సినీ ప్రముఖుల భేటి!

Global Summit 2025: సినిమా రైజింగ్‌ సెషన్‌.. సీఎం రేవంత్‌ రెడ్డితో సినీ ప్రముఖుల భేటి!
Advertisement

Tolllywood Meets CM Revanth Reddy: ‘తెలంగాణ రైజింగ్’ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్‌ సమ్మిట్‌లో పలువురు సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు. సోమ, మంగళ వారాలు రెండు రోజుల పాటు జరిగిన సమ్మిట్లో రెండో రోజు (మంగళవారం) రైజింగ్సినిమా పేరుతో ప్రత్యేక సెషన్నిర్వహించారు. ఇందులో భాగంగా మంగళవారం జరిగిన సమ్మట్ లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు సమ్మిట్లో సమావేశం అయ్యారు.

టాలీవుడ్, బాలీవుడ్ భేటి

Advertisement

సినిమా రైజింగ్ పేరుతో నిర్వహించిన ఈ సెషన్ లో అల్లు అరవింద్‌, సురేష్బాబు, దిల్రాజు, నటి జెనిలియా, అక్కినేని అమల, సుప్రీయ, రాహుల్రవింద్రలు పాల్గొనని సీఎంతో చర్చించారు.  సమావేశంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డిలు కూడా పాల్గొన్నారుఇందులో రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు తెలంగాణను ఒక గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

ఇండస్ట్రీకి ప్రభుత్వ సహాకారం ఉంటుంది.. సీఎం హామీ

Advertisement

సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా, 24 క్రాఫ్ట్స్‌లో స్థానికులను ట్రైన్ చేసే అంశాన్ని పరిశీలించాలని సినీ ప్రముఖులకు సీఎం సూచించారు. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సినీ బృందాలు స్క్రిప్ట్‌తో వస్తే, సినిమా పూర్తి చేసుకుని వెళ్ళేలా రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. మొత్తానికి ఈ సమావేశం తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమ మరింతగా అభివృద్ధి చేసేందుకు, ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక నైపుణ్యాలను పెంచే విషయంలో ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించగలదని భావిస్తున్నారు. ఇక ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హెలికాఫ్టర్ లో రావడం విశేషం.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×