E-Paper
Advertisement

Allari Naresh: అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ అప్డేట్ ఇదే!

Allari Naresh: అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ అప్డేట్ ఇదే!
Advertisement

Allari Naresh: అల్లరి నరేష్‌కు ఈ మధ్యకాలంలో అస్సలు కలిసి రావడం లేదు. కామెడీ చిత్రాలను వదిలి, సీరియస్ రోల్స్ చేస్తూ, తనలోని విలక్షణతను చాటుకుంటున్న అల్లరి నరేష్‌ (Allari Naresh)కు హిట్ మాత్రం రావడం లేదు. చాలా ప్రయోగాలు చేస్తున్నా.. ఒక్కటీ ఆయనని నిలబెట్టలేకపోతుంది. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ కామెడీ గూటికే చేరాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అలా అనుకున్న తర్వాత చేసిన సినిమాలు కూడా అల్లరి నరేష్‌కు కలిసి రావడం లేదు. అయినా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన మరో రొమాంటిక్ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అల్లరి నరేష్ హీరోగా.. సక్సెస్ ఫుల్ బ్యానర్స్ హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియో సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ అప్డేట్ ఏమిటంటే..

Also Read- Lavanya Tripathi: చిరంజీవి పై ట్రోలింగ్ అందుకే రియాక్ట్ అయ్యాను..లావణ్య క్లారిటీ

హిలేరియస్ ఫన్ రైడర్‌

Advertisement

‘రంభ ఊర్వశి మేనక’ (Rambha Urvashi Menaka) అనే టైటిల్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం ఈస్ట్ గోదావరిలో లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా హిలేరియస్ ఫన్ రైడర్‌గా ఉంటుందని, త్వరలోనే థియేటర్లలోకి రానుందని సమాచారం. అల్లరి నరేష్ 65వ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. శర్వానంద్‌తో ‘రాధ’ అనే మూవీ చేసిన చంద్రమోహన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్ర ఓపెనింగ్‌కు నాగ చైతన్య (Naga Chaitanya)తో పాటు దర్శకులు బాబీ, విఐ ఆనంద్, వశిష్ట, రామ్ అబ్బరాజు, విజయ్ కనకమేడల వంటి వారు హాజరైన విషయం తెలిసిందే. హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి కాబట్టి.. కచ్చితంగా ఈసారి అల్లరి నరేష్‌కు హిట్ వస్తుందని ఆయన అభిమానులు కూడా భావిస్తున్నారు.

Also Read- Lavanya Tripathi: మా లవ్ ను నిహారిక క్రాక్ చేసింది.. అసలు స్టోరీ బయటపెట్టిన లావణ్య!

రంభ, ఊర్వశి, మేనక.. ఎవరు?

Advertisement

అల్లరి నరేష్ కూడా ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నారు. మళ్లీ ఒక్క లైఫ్ వస్తే.. కమెడియన్‌గా తన సత్తా చాటేందుకు ఆయన ఎంతగానో ఆశపడుతున్నారు. ఆయన చేసిన ప్రయోగాత్మక చిత్రాలు సక్సెస్ కాలేకపోయినప్పటికీ, అల్లరి నరేష్ యాక్టింగ్ పరంగా మాత్రం మంచి మార్కులే అందుకున్నారు. విమర్శకులు ప్రశంసలు సైతం అల్లరి నరేష్‌కు దక్కాయి. ‘రంభ ఊర్వశి మేనక’ మూవీ అనౌన్స్‌మెంట్ రోజే, ఈ సినిమాపై పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఓపెనింగ్ తర్వాత ఎటువంటి అప్డేట్‌ని మేకర్స్ ఇవ్వలేదు. ఇందులో రంభ, ఊర్వశి, మేనకగా ఎవరు నటిస్తున్నారనేది కూడా క్లారిటీ లేదు. త్వరలోనే సినిమాకు సంబంధించి సాలిడ్ అప్డేడ్‌ను మేకర్స్ వదిలేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.

Also Read- Harish Shankar: పవన్‌తో షూటింగ్ కష్టంగా ఉందా? హరీష్ శంకర్ కామెంట్స్ వింటే ఫ్యూజులు అవుట్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×