E-Paper
Advertisement

12A Railway Colony Collections: 12A రైల్వే కాలనీ, ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. పెద్ద హీరోకి చిన్న వసూళ్లు!

12A Railway Colony Collections: 12A రైల్వే కాలనీ, ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. పెద్ద హీరోకి చిన్న వసూళ్లు!
Advertisement

12A Railway Colony Collections: ‘అల్లరి’ నరేష్‌కు మంచి హిట్‌ పడి చాలా కాలం అవుతుంది. కామెడీని వదిలి సీరియస్‌ జానర్‌కి వచ్చాడు. నాందితో తన రూటు మార్చుకున్నాడు. తొలి ప్రయత్నంలో మంచి హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత ఉగ్రం, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రాలతో సూపర్‌ హిట్‌ కొట్టాడు. కానీ, అదే జోరు కొనసాగించలేకపోయాడు. అయితే కాస్తా గ్యాప్‌ తీసుకుని ఆ ఒక్కటి అడక్కు అంటూ మళ్లీ కామెడీని టచ్ చేశాడు. అది వర్కౌట్‌ కాలేదు. గతేడాది యాక్షన్‌, థ్రిల్లర్‌ బచ్చల మిల్లి సినిమా చేశాడు. కానీ, ఇది కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

వర్కౌట్ కానీ యాక్షన్‌

ఇలా వరుస పరాజయాలు చూస్తున్న నరేష్‌ ఈ సారి క్రైం థ్రిల్లర్‌ 12A రైల్వే కాలనీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం (నవంబర్‌ 21) ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. నరేష్‌ సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు ఆడియన్స్‌ ఓపినియన్‌ మారుతూ ఉంటుంది. గత చిత్రాల ఫలితం ఎలా ఉన్నప్పటి అతడి నుంచి కొత్త సినిమా వస్తుంటే ఆడియన్స్‌లో మినిమమ్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి. ఏదోకలా ఈ అల్లరోడు అలరిస్తాడనేది ఫ్యాన్స్‌ నమ్మకం. అలా ఈసారి క్రైం థ్రిల్లర్‌ అంటూ కొత్త జానర్‌తో వచ్చిన ఆడియన్స్‌లో అవే అంచనాలు ఉన్నాయి. అలా భారీ అంచనాల మధ్య నిన్న థియేటర్లలోకి వచ్చిన 12A రైల్వే కాలనీపై ఆడియన్స్‌, మూవీ టీంలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఫస్ట్‌ డే కలెక్షన్స్

Advertisement

సినిమాపై హైప్‌ కూడా భారీగానే ఉంది. దీంతో ఈ సినిమా ఓపెనింగ్స్‌ చర్చనీయాంశమయ్యాయి. పైగా నరేష్‌ సినిమాకు పెద్దగా పోటీ లేదు. ఈ చిత్రం విడుదలైన రాజు వెడ్స్‌ రాంబాయి చిన్న సినిమా. ప్రియదర్శి ప్రేమంట సినిమాకు పెద్దగా బజ్ లేదు. దీంతో 12A రైల్వే కాలనీకే ఆడియన్స్‌ అంత ఆసక్తి చూపిస్తారని, తొలి రోజు ఈ సినిమా ఓపెనింగ్స్‌ భారీగా ఉంటాయని ట్రేడ్‌ వర్గాలు కూడా అంచన వేశాయి. ఈ చిత్రం దాదాపు కోటీ రూపాయలపైనే ఓపెనింగ్స్‌ ఇస్తాయని ట్రేడ్‌ పండితులు అంచన. కానీ, ఈ చిత్రం ఫస్ట్ డే ఊహించిన వాటి కంటే తక్కువ వసూళ్లు వచ్చాయి. తొలి ఈ సినిమాకు వరల్డ్‌ వైడ్‌గా రూ. 89 లక్షలు మాత్రమే వచ్చినట్టు తెలుస్తోంది. నరేష్‌ సినిమా అంటే మినిమమ్‌ గ్యారంటీ చిత్రం. అలాంటి ఈ హీరో మేకర్స్‌ షాకిచ్చాడంటున్నారు.

Also Read: Raju Weds Rambai Collections: రాజు వెడ్స్‌ రాంబాయి ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. ఇవేం వసూళ్లు భయ్యా!

పెద్ద హీరోకి ఇలాంటి వసూళ్లా!

Advertisement

ఇది అసలు ఊహించలేదని, అంత పెద్ద హీరోకి ఇలాంటి ఓపెనింగ్స్‌ ఏంటని ట్రేడ్‌ వర్గలు కూడా ఆశ్చర్యపోతున్నాయట. పోనీ పెద్ద సినిమాలు పోటీ ఉందంటే అది కూడా లేదు. ఈ వారంలో విడదలైన చిత్రాల్లో 12A రైల్వే కాలనీనే పెద్ద సినిమా. అలాంటి సినిమాకు కూడా ఒపెనింగ్స్‌ ఇలా ఉండటం షాకిస్తుంది. దీనితో పాటు విడుదలైన చిన్న సినిమా రాజు వెడ్స్‌ రాంబాయి దగ్గర దగ్గర కోటీ వసూళ్లు చేసింది. ఈ సినిమా రూ. 78 లక్షలు చేసింది. కానీ, పెద్ద హీరో అయిన నరేష్‌ సినిమా రూ. 89 లక్షలు. అంటే రెండింటి మధ్య పెద్దగా డిఫరెన్స్‌ లేదు. కొత్త నటీనటులతో వచ్చిన ఈ చిన్న సినిమా నరేష్‌ లాంటి పెద్ద హీరోకి పోటీ పడటం సర్‌ప్రైజ్ చేస్తుంది. మరీ వీకెండ్‌లో అయిన ఈ అల్లరోడి సినిమా పుంజుకుని బ్రేక్‌ ఈవెన్‌ని రీచ్‌ అవుతుందో లేదో చూడాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×