E-Paper
Advertisement

Akshay Kumar: కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ కి సిద్ధమైన అక్షయ్ కుమార్.. అక్కడ ప్రశ్నించలేదే అంటూ?

Akshay Kumar: కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ కి సిద్ధమైన అక్షయ్ కుమార్.. అక్కడ ప్రశ్నించలేదే అంటూ?
Advertisement

Akshay Kumar:సాధారణంగా తెలుగు, తమిళ్, హిందీ అంటూ భాషతో పట్టింపు లేకుండా.. కథలో పాత్ర డిమాండ్ చేస్తే వయసుతో సంబంధం లేకుండా ఆ పాత్రలలో నటించాల్సి వస్తుంది. ఇప్పటికే కమలహాసన్ మొదలుకొని చాలామంది హీరోలు వయసులో తమకంటే చాలా చిన్నవారైనా అమ్మాయిలతో రొమాన్స్ చేసి అక్కడక్కడ విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో కూడా గత కొంతకాలంగా సీనియర్ హీరోలు యంగ్ హీరోయిన్లతో జతకడుతూ.. సినిమాలు చేస్తూ ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. ఇదే సమయంలో విమర్శలు కూడా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అక్షయ్ కుమార్ (Akshay Kumar) హీరోగా నటిస్తున్న చిత్రం భూత్ బంగ్లా. ఈ సినిమాలో తనకంటే 26 సంవత్సరాల చిన్నదైన వామికా గబ్బి(Wamiqa gabbi) తో ఆయన నటిస్తుండడంతో గత కొద్ది రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అక్షయ్ కుమార్ తాజాగా స్పందిస్తూ ఇలాంటి విషయాలు అక్కడ ప్రశ్నించరా అంటూ మండిపడ్డారు.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

వయసులో చిన్నదైన అమ్మాయితో అక్షయ్ రొమాన్స్..

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ ,ఏక్తా కపూర్ , శోభ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం భూత్ బంగ్లా. ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో అక్షయ్ కుమార్, టబు , రాజ్ పాల్ యాదవ్ , వామికా గబ్బి, పరేష్ రావల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పైగా ప్రియదర్శన్ నుంచి వస్తున్న రెండవ హిందీ భాష హారర్ కామెడీ చిత్రంగా తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇకపోతే ఈ సినిమాలో అక్షయ్ సరసన వామికా గబ్బి నటించబోతోంది అంటూ ప్రకటించినప్పటి నుంచే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా మారారు అక్షయ్ కుమార్.

ఒక్క మాటతో గట్టి క్లారిటీ ఇచ్చిన అక్షయ్..

Advertisement

ఈ నేపథ్యంలోనే తమ గురించి వస్తున్న రూమర్స్ పై ఆయన స్పందించారు. భూత్ బంగ్లా లో 26 ఏళ్ల చిన్నదైన వామికా గబ్బితో నేను నటిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే హాలీవుడ్ లో కూడా ఇది సహజమే. కథ అవసరాల మేరకే ఇలాంటి ఎంపికలు జరుగుతాయి. నిజజీవితంలోనూ వయసు సంబంధం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారని” ఆయన గుర్తు చేశారు. ఇకపోతే వామికా పనితీరు అద్భుతం అంటూ అక్షయ్ కుమార్ ప్రసంసించారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. మరి ఇప్పటికైనా వయసు తేడాపై వస్తున్న వార్తలకు చెక్ పడుతుందేమో చూడాలి.

ALSO READ:YouTuber Vaishnavi: వైష్ణవి హత్యవెనుక ఇంత కుట్ర ఉందా.. అంతా ఆమె హస్తమేనా?

వామిక గబ్బి కెరియర్..

Advertisement

వామిక గబ్బి విషయానికి వస్తే.. పంజాబీ , హిందీ చిత్రాలలో ప్రధానంగా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గానే తన కెరీర్ ను మొదలు పెట్టింది. 2007లో వచ్చిన జబ్ వి మెట్ అనే హిందీ చిత్రం ద్వారా సినిమా రంగానికి పరిచయమయ్యింది. ఆ తర్వాత కమర్షియల్ గా సక్సెస్ అందుకున్న ‘తూ మేరా 22 మై తేరా 22’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తన అద్భుతమైన నటనతో ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోల ప్రశంసలు కూడా అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×