E-Paper
Advertisement

Akkineni Nagarjuna: నాగార్జునకి మిగిలిన ఏకైక పూలదారి అది ఒక్కటే..!

Akkineni Nagarjuna: నాగార్జునకి మిగిలిన ఏకైక పూలదారి అది ఒక్కటే..!
Advertisement

Akkineni Nagarjuna: తెలుగు సినీ ఇండస్ట్రీలో అమ్మాయిల గుండెల్లో మన్మధుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అక్కినేని నాగార్జున. అయితే గత కొన్నేళ్లుగా ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయాయి. నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్‌ను సరైన విధంగా ఉపయోగించుకోని కథలు..పాత్రలే ఇందుకు కారణమని చాలామంది భావిస్తున్నారు.

ఇటీవల భారీ అంచనాలతో వచ్చిన ఒక సినిమాలో ఆయన చేసిన ప్రత్యేక పాత్ర కూడా నిరాశపరిచింది. పాత్రపై ముందుగా హైప్ ఉన్నప్పటికీ..సినిమాలో ఆ పాత్రకు సరైన ప్రాధాన్యం లేకపోవడం వల్ల నాగార్జున టాలెంట్ వృథా అయిందనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ఆయన తదుపరి సినిమాపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

మిగిలింది ఆ దర్శకుడే..!

Advertisement

ఈ క్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి పేరు బలంగా వినిపిస్తోంది. అనిల్ రవిపూడి ఇప్పటివరకు సీనియర్ హీరోలతో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధించాయి. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో ఆయన చేసిన సినిమాలు పండగల సీజన్‌లో మంచి విజయాలు అందుకున్నాయి.

ఇప్పటివరకు అనిల్ రవిపూడితో సినిమా చేయని సీనియర్ హీరోల్లో నాగార్జున ఒకరు. ప్రస్తుతం ఆయన కెరీర్‌కు ఇది సరైన టర్నింగ్ పాయింట్.. కావచ్చని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. పూర్తిగా సేఫ్ జోన్‌లో ఉండే ఎంటర్టైనర్ అయినా..లేకపోతే కొంచెం కొత్తదనం ఉన్న కథ అయినా అనిల్ రవిపూడి హ్యాండిల్ చేయగలడన్న నమ్మకం ఉంది.

Advertisement

అంతేకాదు బాలకృష్ణ భగవంత్ కేసరి.. లాంటి సినిమాతో అనిల్ రావిపూడి సీరియస్ టోన్‌ను కూడా విజయవంతంగా చూపించాడు. ఇది నాగార్జునకు మరింత ధైర్యం ఇచ్చే అంశం. మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే.. అనిల్ సినిమాలు తక్కువ బడ్జెట్‌లో.. వేగంగా పూర్తవుతాయి. దీంతో నాగార్జున నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా లాభాలు కూడా తెచ్చే అవకాశాలు బీభత్సంగా ఉంటాయి.

కాబట్టి ..అన్ని అనుకూలంగా జరిగితే ఈ కాంబినేషన్‌తో సినిమా సంక్రాంతి 2027కి వచ్చే అవకాశం ఉందని టాక్. మొత్తానికి చూస్తే, నాగార్జునకు ఇది “లాస్ట్ కానీ బెస్ట్ ఆప్షన్” అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Also Read: Sankranti 2026 Movies : నవ్వులను నమ్ముకుని నవ్వుల పాలయ్యారు… సంక్రాంతి డైరెక్టర్ల ‘కథ’ అస్సలు బాలేదు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×