E-Paper
Advertisement

Akkineni Hero: తండ్రి రొమాన్స్ చేసిన హీరోయిన్ తోనే ప్రేమలో పడిన అక్కినేని హీరో.. ఇదేం ట్విస్ట్ రా బాబు..!

Akkineni Hero: తండ్రి రొమాన్స్ చేసిన హీరోయిన్ తోనే ప్రేమలో పడిన అక్కినేని హీరో.. ఇదేం ట్విస్ట్ రా బాబు..!
Advertisement

Akkineni Hero: అక్కినేని కుటుంబం అంటేనే అందులో హీరోలందరూ ఎక్కువగా రొమాంటిక్ సినిమాలు చేస్తారు అన్న విషయం తెలిసిందే. నాగేశ్వరరావు దగ్గర నుంచి నాగచైతన్య వరకు రొమాంటిక్ హీరోస్ కానీ పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా నాగార్జున.. తన కాలంలో రొమాంటిక్ హీరోగా మంచి పేరు సంపాదించారు. ఆయనను మన్మథుడు అని కూడా పిలుస్తారు. ఇప్పుడు అదే మార్గంలో ఆయన కుమారుడు నాగచైతన్య కూడా ప్రేమ కథా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

నాగచైతన్య కెరీర్‌లో విజయవంతమైన చిత్రాల్లో ఎక్కువగా ప్రేమ కథలే ఉన్నాయి. ఏం మాయ చేశావె, 100 శాతం లవ్, మనం, మజిలి, లవ్ స్టోరీ వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. నిజ జీవితంలో కూడా ఆయన ప్రేమ కథలు వార్తల్లో నిలిచాయి. ముందుగా సమంతను ప్రేమించి వివాహం చేసుకున్నారు. తరువాత ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత శోభిత.. కొత్త జీవితం ప్రారంభించారు.

Advertisement

కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్య తన మొదటి సెలబ్రిటీ క్రష్ గురించి వెల్లడించారు. మాజీ విశ్వసుందరి సుస్మిత సేన్ తన ఫస్ట్ క్రష్ అని చెప్పారు. ఆమె అందం.. వ్యక్తిత్వం తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సుష్మితా సేన్ గతంలో నాగార్జునతో కలిసి ఒక చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో వారు జంటగా కనిపించారు. ఒకప్పుడు తన తండ్రితో తెరపై ప్రేమ కథలో నటించిన హీరోయిన్ పై తనకు క్రష్ ఉండేదని నాగచైతన్య చెప్పడం ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.

ప్రస్తుతం నాగచైతన్య తండేల్ విజయానంతరం కొత్త చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న వృషకర్మ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

ALSO READ: Sreeleela: శ్రీలీల కాదు.. ఇకమీదట డాక్టర్ శ్రీలీల..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×