E-Paper
Advertisement

Lenin Movie: రీ షూట్ పనులలో అఖిల్ లెనిన్… వాలెంటైన్స్ డే టార్గెట్!

Lenin Movie: రీ షూట్ పనులలో అఖిల్ లెనిన్… వాలెంటైన్స్ డే టార్గెట్!
Advertisement

Lenin Movie: అక్కినేని అఖిల్ హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు ఒక్క హిట్ మాత్రం అందుకోలేకపోతున్నారు. అఖిల్ అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన అఖిల్ పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఏ ఒక్క సినిమా కూడా ఈయనకు పేరు ప్రఖ్యాతలను అందించలేకపోయింది. ఎలాగైనా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవాలనే కసితో అఖిల్(Akhil) వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక త్వరలోనే లెనిన్(Lenin) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

రాయలసీమ బ్యాక్ డ్రాప్..

నిజానికి ఈ సినిమా నవంబర్ నే విడుదల అవుతుంది అంటూ గతంలో వార్తలు వచ్చాయి కానీ ఈ సినిమా షూటింగ్ పనులు ఇంకా పెండింగ్ ఉన్న నేపథ్యంలోనే ఈ ఏడాది విడుదల వాయిదా పడింది.ముర‌ళీకృష్ణ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో రాయలసీమ బ్యాగ్ డ్రాప్ లవ్ స్టోరీ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ పాత్రలో శ్రీ లీల(Sreeleela) ఎంపిక అయ్యారు. ఈమె కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా నుంచి కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారు.. ఈ విధంగా శ్రీ లీల తప్పుకోవడంతో ఈ సినిమాలోకి భాగ్యశ్రీ (Bhagya Shri) ఎంట్రీ ఇచ్చారు.

ఫిబ్రవరి 14న లెనిన్ విడుదల?

Advertisement

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు దాదాపు పూర్తి అయ్యాయని తెలుస్తుంది. కానీ శ్రీ లీలపై షూటింగ్ చేసిన సన్నివేశాలను తిరిగి భాగ్యశ్రీ పై షూట్ చేయాల్సి ఉందని తెలుస్తుంది. ఇలా ఈ రీ షూటింగ్ మినహా ఈ సినిమా దాదాపు షూటింగ్ పనులు పూర్తి అయ్యాయని సమాచారం. అయితే ఈ సినిమాని 2026 ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే ను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇక త్వరలోనే భాగ్యశ్రీ ఈ సినిమా షూటింగ్ లో బిజీ కాబోతున్నట్టు సమాచారం.

శ్రీ లీల స్థానంలో భాగ్యశ్రీ..

Advertisement

ఇప్పటివరకు భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించిన కాంత ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలు వరుసగా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో ఈమె బిజీగా ఉన్నారు. త్వరలోనే లేని సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారని సమాచారం. డిసెంబర్ చివరికల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు మరోవైపు ఎమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఫిబ్రవరి 14వ తేదీ ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో వాలెంటైన్స్ డే సందర్భంగా హీరో నిఖిల్ నటించిన స్వయంబు సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇలా వాలెంటైన్స్ డే కి అఖిల్ ,నిఖిల్ మద్య గట్టి పోటీ ఉండబోతుందని తెలుస్తోంది.

Also Read: Nani-Sujeeth: షూటింగే మొదలు కాలేదు.. ఓటీటీ డీల్ ఫిక్స్ చేసుకున్న నాని మూవీ?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×