// // Spirit Movie- ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌.. మళ్లీ స్పిరిట్‌ వాయిదా! -->
E-Paper
Advertisement

Prabhas Spirit :స్పిరిట్‌ మళ్లీ వాయిదా… తప్పు డార్లింగ్‌దా? సందీప్‌దా?

Prabhas Spirit :స్పిరిట్‌ మళ్లీ వాయిదా… తప్పు డార్లింగ్‌దా? సందీప్‌దా?
Advertisement

Again Spirit Shooting Delayed: డార్లింగ్ ప్రభాస్‌ బర్త్‌డే వచ్చేస్తోంది. ఇక వరుస అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌ ఫుల్‌ ట్రీట్‌ ఇచ్చేందుక మేకర్స్‌ సిద్దంగా ఉన్నారు. ఈ సారి ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగు చిత్రలకు సంబంధించిన అప్‌డేట్స్‌ రాబోతున్నాయి. ఇందులో ఎక్కువగా ఆసక్తి కనబరుస్తోన్న మూవీ మాత్రం స్పిరిట్‌. సందీప్‌ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ఈ ప్రాజెక్ట్‌ ఫిక్స్‌ అయ్యి చాలాకాలం అయ్యింది. దీనిపై ఆఫీషియల్‌ ప్రకటన వచ్చి కూడా మూడేళ్లు అవుతుంది. కానీ, ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌ పట్టాలేక్కలేదు. అదీ కాదు కనీసం లాంచ్‌ కూడా అవ్వలేదు.

స్పిరిట్‌ మళ్లీ వాయిదా ?

Advertisement

దీంతో ఈ ఏడాది అక్టోబర్‌ లేదా నవంబర్‌లో స్పిరిట్‌ లాంచ్‌ చేసి మూవీసెట్స్‌పైకి తీసుకువస్తానని సందీప్‌ స్వయంగా చెప్పాడు. కానీ, ఇప్పుడు ఈ సినిమా మళ్లీ వాయిదా పడబోతుందట. అక్టోబర్‌, నవంబర్‌లో కాకుండా.. వచ్చే ఏడాది స్పిరిట్‌ని లాంచ్‌ చేయాలని చూస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ అప్డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాగా స్పిరిట్‌ మూవీ ఇదిగో వస్తుంది, అదిగో వస్తుందంటూ కొన్ని రోజులు సందీప్‌ రెడ్డి వంగా ఊరిస్తూ వస్తున్నారు. ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ సినిమా తరుచూ వాయిదా పడుతోంది. స్పిరిట్‌ ప్రకటన సమయంలో ప్రభాస్‌ చేతిలో మూడు భారీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. అవి ఆదిపురుష్‌, సలార్, కల్కి. ప్రభాస్‌ సినిమా షెడ్యూల్‌ చూసి సందీప్‌ రెడ్డి.. రణ్‌బీర్‌ కపూర్‌తో యానిమల్‌ చేశాడు.

మళ్లీ ఫ్యాన్స్‌ కి ఎదురుచూపులే..

2023లో విడులైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది. అప్పటికే ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉండటం.. సలార్‌, కల్కి షూటింగ్‌ మొదలు కావాల్సి ఉంది. రెండేళ్లలో ఇవి పూర్తయినా.. 2024లో స్పిరిట్‌ సెట్స్‌పైకి వస్తుందని అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. కల్కి మూవీ షూటింగ్‌ కూడా పూర్తయి విడుదలైంది. సందీప్‌ యానిమల్ చేస్తుంటే.. ప్రభాస్‌ సైలెంట్‌‌గా మారుతితో ది రాజాసాబ్‌ ను లైన్లో పెట్టాడు. ఇక స్పిరిట్‌ వచ్చేస్తుందని ఆశగా చూసిన ఫ్యాన్స్‌ ప్రభాస్‌ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. హను రాఘపూడితో మూవీ ప్రకటించడంతో పాటు ఏకంగా లాంచ్‌ చేశాడు. షూటింగ్‌ కూడా మొదలెట్టశారు. దీంతో స్పిరిట్‌ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. కారణం స్క్రిప్ట్‌ లేటు అని తెలిసింది. దీంతో 2025లో ప్రథమార్థంలో అయినా స్పిరిట్‌ సెట్‌పైకి వస్తుందని ఆశపడ్డ ఫ్యాన్స్‌కి మళ్లీ నిరాశే ఎదురైంది.

2026 ఫిబ్రవరిలో..

Advertisement

దీంతో ఈసారి పక్కా వస్తామని, అక్టోబర్‌, నవంబర్‌ సినిమాను లాంచ్‌ చేయడం పక్కా అన్నట్టుగా సందీప్‌ రెడ్డి వంగా కొన్ని రోజులుగా చెప్పుకొస్తున్నాడు. దీంతో ప్రభాస్‌ బర్త్‌డేకు సందీప్‌ స్పెషల్‌ సర్‌ప్రైజ్ ప్లాన్‌ చేసుంటాడని ఫ్యాన్స్‌ అంత కళ్లల్లో వొత్తులేసుకుని మరి చూస్తున్నారు. కానీ, ఈసారి కూడా ఫ్యాన్స్‌కి నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఇంతవరకు స్పిరిట్‌ స్పందించి ఎలాంటి హడావుడి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ స్పిరిట్‌ మళ్లీ వాయిదా పడుతుందని, మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 2026లో లాంచ్‌ చేయాలని చూస్తున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ప్రభాస్‌ బర్త్‌డే కి స్పిరిట్‌ నుంచి సర్‌ప్రైజ్ వస్తుందనుకుంటే బ్యాడ్‌ న్యూస్‌ అందేలా కనిపిస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే రేపటి (అక్టోబర్‌ 23) వరకు వెయిట్‌ చేయాల్సిందే.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×