E-Paper
Advertisement

Prabhas : మారుతికి ఆగని టార్చర్… మీడియం రేంజ్ హీరో అభిమానులు అంటూ మరోసారి నోరు జారిన దర్శకుడు..!

Prabhas : మారుతికి ఆగని టార్చర్… మీడియం రేంజ్ హీరో అభిమానులు అంటూ మరోసారి నోరు జారిన దర్శకుడు..!
Advertisement

Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరోసారి ప్రభాస్ అభిమానులు.. మారుతి వివాదం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. దర్శకుడు మారుతి పేరు ట్రెండింగ్‌లోకి రావడానికి కారణం కొన్ని వాట్సాప్ గ్రూప్ స్క్రీన్‌షాట్లు వైరల్ కావడమే…అందులో మారుతి మరోసారి ప్రభాస్‌ను “మీడియం రేంజ్ హీరో”గా వ్యాఖ్యానించినట్టు ప్రచారం జరగడంతో ప్రభాస్ అభిమానులు తీవ్రంగా మంది పడుకున్నారు.

వాస్తవానికి మారుతి ఇప్పటివరకు ఎక్కువగా మిడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేసిన దర్శకుడు. అలాంటి మారుతికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టమే అని చెప్పవచ్చు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది రాజా సాబ్’. భారీ అంచనాల మధ్య సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్‌గా నిలవడంతో విమర్శలు మొదలయ్యాయి.

Advertisement

ఒక సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే నిరాశ చెందడం సహజమే. కానీ ఆ నిరాశను ఆరోగ్యకరంగా వ్యక్తం చేయకుండా, కొందరు అభిమానులు దర్శకుడిని నేరుగా లక్ష్యంగా చెయ్యడం ప్రస్తుతం పెద్ద వార్తగా మారింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మారుతి.. పేరుతో జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్‌లలో భారీగా ఫేక్ ఆర్డర్లు పెడుతున్నారు ఎంత. ఆహారంతో పాటు మెడికల్ సరుకులు కూడా ఆయన అనుమతి లేకుండా ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్కరోజులోనే వరుసగా డెలివరీలు రావడంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బందికి తీవ్ర గందరగోళం ఏర్పడింది.

సెక్యూరిటీ సిబ్బంది దర్శకుడిని సంప్రదించి ఆర్డర్ల గురించి అడిగితే, తాను ఏమీ ఆర్డర్ చేయలేదని స్పష్టంగా చేసారంట. ఆశ్చర్యకరంగా ఒక్కరోజులోనే వందకు పైగా డెలివరీ ప్యాకెట్లు ఆయన ఇంటికి వచ్చాయి. డెలివరీ బాయ్స్ రాకపోకలతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. చివరకు దర్శకుడు తన పేరుతో వచ్చే ఎలాంటి డెలివరీలను లోపలికి అనుమతించవద్దని సెక్యూరిటీకి చెప్పాల్సి వచ్చింది.

Advertisement

ఇదే సమయంలో మరో సమస్య కూడా వెలుగులోకి వచ్చింది. కొంతమంది ప్రభాస్ అభిమానులు మారుతిని ఒక ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి అతనిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ఆ గ్రూప్‌లో జరిగిన చాట్ స్క్రీన్‌షాట్లు బయటకు రావడంతో విషయం మరింత పెద్దదైంది. దీనికి స్పందించిన మారుతి “బై.. మీడియం రేంజ్ హీరో ఫ్యాన్స్” అంటూ మెసేజ్ చేసి గ్రూప్ నుంచి బయటకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ఒక్క మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

ALSO READ: Vijay Devarakonda in Spirit: ప్రభాస్ సినిమాలో విజయ్ దేవరకొండ.. సందీప్ రెడ్డి బిగ్ ప్లాన్..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×