E-Paper
Advertisement

Ram Charan: పెద్ది షూటింగ్ సెట్ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. షూటింగ్ ఎక్కడంటే?

Ram Charan: పెద్ది షూటింగ్ సెట్ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. షూటింగ్ ఎక్కడంటే?
Advertisement

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ram Charan Tej)ఇటీవల పెద్ది సినిమా(Peddi Movie) షూటింగ్లో భాగంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రామ్ చరణ్ కు ప్రమాదం జరగడంతో కంటి పై భాగంలో చిన్నపాటి గాయం తగిలింది. అయితే ఈ భాగంలో నాలుగు కుట్లు పడినట్లు చిత్రబృందం అధికారకంగా తెలియజేశారు. ఇలా చరణ్ కంటి పై భాగంలో ప్రమాదం జరగడంతో అభిమానులు ఆందోళన చెందారు అయితే ఈ ప్రమాదం కారణంగా కంటికి ఎలాంటి ఇబ్బంది లేదని ఎవరు కంగారు పడాల్సిన పనిలేదని చిత్ర బృందం తెలిపారు. ఇలా చరణ్ కు పెద్ద ప్రమాదం తప్పిందనే విషయం తెలిసిన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

పెద్ది సెట్స్ లోకి అడుగుపెట్టిన చరణ్..

ఇకపోతే రామ్ చరణ్ కంటికి సర్జరీ చేసిన డాక్టర్ కు ఉపాసన, చిరంజీవి ఇద్దరు ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. ఇలా రామ్ చరణ్ కు చిన్న ప్రమాదం జరగడంతో ఈయన షూటింగుకు ఏ మాత్రం బ్రేక్ ఇవ్వకుండా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలియజేశారు. అయితే రామ్ చరణ్ నేడు తిరిగి ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ తిరిగి పెద్ది సినిమా షూటింగ్ సెట్ లోకి అడుగుపెట్టారని తెలుస్తోంది.

పెద్ది మళ్లీ వాయిదా పడుతోందా?

Advertisement

ఇలా కంటికి గాయం అయినప్పటికీ సినిమాని అనుకున్న విధంగానే పూర్తి చేయాలన్న ఉద్దేశంతో చరణ్ ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా యధావిధిగా సినిమా షూటింగ్ పనులలో భాగం కావడంతో సినిమా పట్ల చరణ్ కు ఉన్న డెడికేషన్ తెలిసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాని ఏప్రిల్ 30వ తేదీ విడుదల చేయాలని చిత్రబృందం భావించారు అయితే ఇంకా షూటింగ్ మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ సినిమాని మరోసారి వాయిదా వేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అధికారక ప్రకటన వెలువడ లేదు. మరి ఈ సినిమా ముందుగా చెప్పిన విధంగానే ఏప్రిల్ 30వ తేదీ విడుదల అవుతుందా లేదంటే మరోసారి వాయిదా వేస్తారా అనే విషయంపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.

చరణ్ బర్త్ డే స్పెషల్ గ్లింప్స్ ..

Advertisement

ఇక ఈ సినిమాలో రెండు పాటలు షూటింగ్ జరుపుకోవాల్సి ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన భాగం మొత్తం డబ్బింగ్ పనులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా జరుపుకుంటుంది. ఇక మార్చి 27వ తేదీ రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుంచి ఒక గ్లింప్ వీడియోని విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు. కుస్తీ పోటీలకు సంబంధించిన గ్లింప్ విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన పాటలు సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. ఈ సినిమాతో రామ్ చరణ్ బుచ్చిబాబు ఇద్దరు పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్ అందుకోబోతున్నారని అభిమానులు కూడా భావిస్తున్నారు.

Also Read: Niharika Chiranjeevi: నిహారికాకు అదిరిపోయే కథ చెప్పిన చిరంజీవి… ట్విస్టులు మామూలుగా లేవు!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×