E-Paper
Advertisement

Dacoit Teaser: కన్నె పిట్టరో.. కన్ను కొట్టరో అంటూ డెకాయిట్ టీజర్ రిలీజ్..

Dacoit Teaser: కన్నె పిట్టరో.. కన్ను కొట్టరో అంటూ డెకాయిట్ టీజర్ రిలీజ్..
Advertisement

Dacoit Teaser: అడివి శేష్ (Adivisesh), మృణాళ్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా నటిస్తున్న చిత్రం డెకాయిట్(Dacoit). పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ వీడియో విడుదల చేశారు. మార్చి 19, 2026న ఉగాది రోజున గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే సినిమా నుంచి టీజర్ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ టీజర్ చూస్తుంటే మాత్రం ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ సినిమా గానే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈ టీజర్ వీడియోలో అడివి శేషు ఒక దొంగగా కనిపిస్తారు అతనిని పోలీసుల చెర నుంచి తప్పించడం కోసం మృణాళ్ రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఈ టీజర్ వీడియో యాక్షన్ లవ్ డ్రామా తో కొనసాగుతుందని చెప్పాలి. ఇక ఈ వీడియో మొత్తం కన్నె పిట్టరు కన్నకొట్టారు అంటూ నాగార్జున సూపర్ హిట్ సాంగ్ తో కొనసాగటం మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ వీడియో చూస్తుంటే అడివి శేష్ ఈ సినిమాతో మరో విభిన్నమైన కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ మరో హిట్ సినిమాని అందుకోబోతున్నారని స్పష్టమవుతుంది.

దొంగగా అడివి శేష్..

ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరు దొంగలుగా కనిపించబోతున్నారని టీజర్ ద్వారా స్పష్టం చేశారు. ఫుల్ యాక్షన్ లవ్ డ్రామాగా తెరికెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు షానిల్ డియో దర్శకత్వం వహించగా, బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ ఈ చిత్రంలో కీల‌క పాత్రలో సందడి చేయనున్నారు. మొత్తానికి మరో యాక్షన్ మూవీ ద్వారా అడివి శేష్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

Advertisement

అడివి శేష్ సినిమాలన్నీ కూడా విభిన్నమైన కథ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. చివరిగా మేజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న శేష్ డెకాయిట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈయనకు జోడిగా మృణాళ్ ఠాకూర్ నటిస్తున్నారు. మొదటిసారి వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈమెకు తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమైన మృణాళ్ చివరిగా ఫ్యామిలీ స్టార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా అనంతరం శేష్ కు జోడిగా డెకాయిట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Advertisement

Also Read: Samantha: కొత్త ఏడాది కోసం సమంత కీలక నిర్ణయం.. అదే నా లక్ష్యం అంటూ!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×