E-Paper
Advertisement

పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టిన శ్రీ రెడ్డి.. 2 రోజుల్లోనే ఊహించని సబ్‌స్క్రైబర్స్!

పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టిన శ్రీ రెడ్డి.. 2 రోజుల్లోనే ఊహించని సబ్‌స్క్రైబర్స్!
Advertisement

Sri Reddy:ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఇంస్టాగ్రామ్ ద్వారా ఫాలోవర్స్ ను పెంచుకోవడం ఒక ఎత్తైతే ఆ ఫాలోవర్స్ ను సబ్‌స్క్రైబర్స్ గా మార్చుకొని ఆదాయాన్ని పెంపొందించుకుంటున్నారు. అందులో భాగంగానే గ్లామర్ డోస్ పెంచి ఘాటు అందాలు చూడాలి అంటే సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాల్సిందే అంటూ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది ప్రముఖ బ్యూటీ విష్ణుప్రియ (Vishnu Priya). తన అందాల జాతర చూడాలి అంటే రూ.399 నెలకు చెల్లించి పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి అంటూ కామెంట్ చేసింది. అయితే ఈ విషయంపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ ఈమెకు సబ్‌స్క్రైబర్స్ మాత్రం భారీగా పెరిగిపోయారు.

పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ తో అందాల జాతర మొదలుపెట్టిన హీరోయిన్స్…

ఈమెకు తోడు ప్రముఖ నటి అషు రెడ్డి కూడా అదే బాటలో నడిచింది.. పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఓపెన్ చేసింది. కానీ అంతలోనే రూ.9 కోట్ల చీటింగ్ కేసులో ఇరుక్కొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మినబలికి సుమారుగా 9 కోట్ల రూపాయలను ఎన్నారై ధర్మేంద్ర నుండి తీసుకొని మోసం చేసిందని , అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని సదరు బాధితుడి తండ్రి హైదరాబాద్ సీసీఎస్ లో కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. ఇక దీనిపై స్పందించిన అషు రెడ్డి ఆధారాలు లేకుండా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తే లీగల్ గా యాక్షన్ తీసుకుంటానని తెలిపింది. అటు కోర్టు కూడా ఈమెకు అనుకూలంగానే మాట్లాడుతూ నిజం తేలే వరకు ఆమె పరువుకు ఇబ్బంది కలిగించకూడదు అని కామెంట్లు చేసింది.. అయితే ఈ చీటింగ్ కేస్ కారణంగా అషు రెడ్డి ఇంస్టాగ్రామ్ ఖాతాలో సబ్‌స్క్రైబర్స్ భారీగా పెరిగిపోయారు. ఆమె నెల ఆదాయం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఇప్పుడు వీరిద్దరి బాటలో మరో బ్యూటీ శ్రీరెడ్డి కూడా వచ్చి చేరింది.

మొన్న విష్ణు ప్రియ.. నిన్న అషురెడ్డి.. నేడు శ్రీరెడ్డి..

Advertisement

ఇండస్ట్రీలో ఈమె పేరు గురించి తెలియని వారు ఉండరు. ఎప్పుడూ తనదైన కామెంట్స్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేసే ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. నేను నాన్న అబద్ధం, అరవింద్ 2 వంటి చిత్రాలలో నటించిన ఈమె క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు అటు రాజకీయంగా విమర్శలు చేస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా కూడా నిలిచింది శ్రీ రెడ్డి. ఇకపోతే ఇప్పుడు ఒకవైపు ఇన్ స్టా లో సబ్‌స్క్రిప్షన్ మీద వివాదం జరుగుతుండగానే.. మరొకవైపు పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ చేసుకునే సెలబ్రిటీలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నారు.

ALSO READ:నిశ్చితార్థం చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

రెండు రోజుల్లోనే భారీ సబ్‌స్క్రైబర్స్..

Advertisement

ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు శ్రీరెడ్డి కూడా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ పేరిట ఆప్షన్ ను యాక్టివేట్ చేసింది.సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శ్రీరెడ్డి ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఫోటోషూట్స్ , వీడియోలు , ఇన్స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది .ఇకనుంచి తన ఫోటోలు చూడాలి అంటే నెలకు 399 రూపాయలు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలని తెలిపింది . అయితే ఆమె అలా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ పెట్టిందో లేదో అప్పుడే రెండు రోజుల్లోనే 520 మంది సబ్‌స్క్రైబర్స్ వచ్చి చేరారు. అయితే దీనిపై మరికొంతమంది నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అందాలను వలగా వేసి పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ పేరిట యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×