E-Paper
Advertisement

Samantha: కొత్త ఏడాది కోసం సమంత కీలక నిర్ణయం.. అదే నా లక్ష్యం అంటూ!

Samantha: కొత్త ఏడాది కోసం సమంత కీలక నిర్ణయం.. అదే నా లక్ష్యం అంటూ!
Advertisement

Samantha: మరొక పది రోజులలో ఈ సంవత్సరానికి గుడ్ బై చెబుతూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ కూడా కొత్త ఏడాదిలో చేయాల్సిన పనులకు సంబంధించి ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకున్నారు. ఇక సెలబ్రిటీలు కూడా 2026 రిసోల్యూషన్స్(2026 resolutions ) గురించి కూడా సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha)సైతం 2026 లో చేయబోయే పనులు నెరవేరాల్సిన లక్ష్యాల గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. సమంత ఇన్స్టాగ్రామ్ వేదికగా నవ్వుతూ క్యూట్ గా ఉన్న ఒక ఫోటోని షేర్ చేశారు.

లక్ష్యాలకు అనుగుణంగా నడుచుకోవడం

ఇలా ఈ ఫోటోని షేర్ చేసిన సమంత కొత్త ఏడాదిలో తన లక్ష్యాలు ఏంటో కూడా బయటపెట్టారు. 2026వ సంవత్సరంలో తను కృతజ్ఞత ,లోతైన బంధాలు, ప్రశాంతమైన పని, స్థిరమైన ఎదుగుదల, లక్ష్యాలకు అనుగుణంగా నడుచుకోవడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, తన లక్ష్యాలను చేరుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తాను అంటూ తన న్యూ రిసోల్యూషన్స్ గురించి సమంత ఈ సందర్భంగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్ట్ పై అభిమానులు కూడా విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. సమంత పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

రాజ్ తో కొత్త ప్రయాణం

Advertisement

సమంత డిసెంబర్ ఒకటవ తేదీ తన రూమర్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru)ను పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీరిద్దరు గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి కానీ ఈ రిలేషన్ వార్తలపై సమంత ఎక్కడ స్పందించలేదు . ఇక సమంత రాజ్ ను పెళ్లి చేసుకొని పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. వీరిద్దరూ ఈషా ఫౌండేషన్ లోని లింగ బైరవి ఆలయంలో అది కొద్ది మంది సమక్షంలో వివాహం జరుపుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఇలా సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత డైరెక్టర్ రాజ్ ను పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన సమంత కొత్త సంవత్సరంలో కూడా తన లక్ష్యాలను తెలియజేస్తూ పోస్ట్ చేయడంతో అభిమానులు కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నారు. ఇక సమంత సినీ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక సమంత కేవలం నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె తన సొంత నిర్మాణ సంస్థలో ప్రముఖ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం(Maa Inti Bangaram) అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Chinmayi: మగాళ్లు కాదు.. మానవ మృగాలు నిధి అగర్వాల్ విషయంలో ఫైర్ అయిన చిన్మయి!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×