E-Paper
Advertisement

కూతురిని పరిచయం చేసిన పూర్ణ..ఆమె తిరిగి వచ్చిందంటూ ఎమోషనల్ పోస్ట్!

కూతురిని పరిచయం చేసిన పూర్ణ..ఆమె తిరిగి వచ్చిందంటూ ఎమోషనల్ పోస్ట్!
Advertisement

Actress Poorna:  టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈమె ఇప్పటికీ పలు సినిమాలలో హీరోయిన్గా కాకపోయినా కీలక పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తున్న పూర్ణ మరో వైపు తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. పూర్ణ ఇటీవల ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇదివరకే పూర్ణ దంపతులకు కుమారుడు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు కూతురు జన్మించడంతో ఈమె ఆనందానికి అవధులు లేవు.

దువా జమీలా..

తన కుమార్తె పుట్టిందని అభిమానులతో శుభవార్తను పంచుకున్న  పూర్ణ తాజాగా తన కుమార్తెను అందరికీ పరిచయం చేశారు. తాజాగా తన కూతురికి నామకరణం చేసినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఈమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ తన కుమార్తెకు దువా జమీలా (Dua Jameela)అని పేరు పెట్టినట్టు తెలియజేశారు అయితే ఆ పేరు పెట్టడానికి గల కారణం ఏంటి అని విషయం గురించి కూడా ఈమె మాట్లాడుతూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.

కూతురికి అమ్మమ్మ పేరు పెట్టిన పూర్ణ…

Advertisement

తన కుమార్తెకు జమీలా అనే పేరు పెట్టడంతో చాలామంది ఎందుకు ఆ పేరు పెట్టారని అడిగారు. అయితే ఆ పేరు తన అమ్మమ్మ పేరు అని పూర్ణ క్లారిటీ ఇచ్చారు. చిన్నప్పుడే నా అమ్మమ్మ చనిపోయిన ఆమెకు సంబంధించిన జ్ఞాపకాలు ప్రతిక్షణం నాతోనే ఉన్నాయి. తనకు కనుక కూతురు పుడితే కచ్చితంగా తాను తన అమ్మమ్మ పేరు పెట్టుకుంటానని చెప్పాను. ఇప్పుడు మాట నిలబెట్టుకునే సమయం వచ్చింది. తనకు కూతురు పుట్టడంతో తన అమ్మమ్మ పేరు పెట్టినట్టు తెలిపారు. మొదటిసారి తన కుమార్తెను తన చేతులలోకి తీసుకున్నప్పుడు ఏదో తెలియని సంతోషం కలిగిందని అమ్మమ్మ తిరిగి నా దగ్గరకు వచ్చిందనే భావన కలిగిందని పూర్ణ తెలిపారు. ఇలా పాప పుట్టడం ఎంతో సంతోషంగా ఉందని తన సంతోషాన్ని తెలియజేశారు.

Advertisement

ఇక తన కుమార్తె పుట్టిన 28 రోజులకు వారి కుటుంబ సాంప్రదాయాల ప్రకారం నూలేకెట్టి వేడుకను ఘనంగా నిర్వహించామని ఈ సందర్భంగా పూర్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక ఈ దంపతులకు ఇదివరకే ఒక కుమారుడు ఉన్నారు. ఇక పూర్ణ 2022వ సంవత్సరంలో దుబాయ్ కి చెందిన షానిద్ ఆసిఫ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్న ఈమె ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పలు బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Also Read: తినడానికి తిండి లేదు…ఒక్క పూట భోజనం కోసం  ఎన్నో కష్టాలు..ఫైమా ఎమోషనల్ కామెంట్స్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×