// // Actress Madhavi Latha: మగాళ్లు ధోతీలు వేసుకోవాలి -->
E-Paper
Advertisement

Actress Madhavi Latha: అనసూయకు మద్దతుగా మాధవీలత.. మగాళ్లు ధోతీ వేసుకోవాలంటూ!

Actress Madhavi Latha: అనసూయకు మద్దతుగా మాధవీలత.. మగాళ్లు ధోతీ వేసుకోవాలంటూ!
Advertisement

Actress Madhavi Latha: సినీ నటుడు శివాజీ (Sivaji)హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ గురించి చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్లు ఒక్కొక్కరుగా స్పందిస్తూ శివాజీ వ్యాఖ్యలను పూర్తిగా తప్పుపడుతున్నారు. ఎంతోమంది హీరోయిన్లు శివాజీకి కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శివాజీ అనసూయ(Anasuya) మధ్య ఈ విషయంపై కోల్డ్ వార్ జరుగుతుంది. ఈ విషయంలో ఎంతోమంది అనసూయకు మద్దతు తెలియజేయగా మరికొందరు శివాజీకి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే సినీ నటి మాధవి లత సైతం అనసూయకు మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.

ఆడవాళ్లను అణిచివేస్తున్నారు..

ఈ వీడియోలో భాగంగా ఈమె మహిళలు చీరలు కట్టుకుంటే వారిపై అత్యాచారాలు జరగవని చెబుతున్న అబ్బాయిలు కూడా దోతీలు కట్టుకొని సంప్రదాయంగా బొట్లు పెట్టుకొని చాలా పద్ధతిగా త్రేతాయుగంలో తిరిగినట్టు తిరగండి. లేదంటే ఆడోల్లకు మిమ్మల్ని చంపేయాలనిపిస్తుంది అంటూ పరోక్షంగా శివాజీ వ్యాఖ్యలపై కౌంటర్ ఇస్తూ ఈమె ఒక వీడియోని షేర్ చేశారు. మగాళ్లకు ఏది కంఫర్ట్ గా ఉంటే అదే సమాజంలో న్యాయమా? లేదంటే అన్యాయమా ఎటైనా ఆడోళ్ళను మీరే అణిచివేస్తున్నారు అంటూ ఈమె మగాళ్లపై ఫైర్ అయ్యారు.

సాంప్రదాయం అంటే కట్టుబొట్టు మాత్రమే కాదు..

Advertisement

ఇలాంటి విషయాలకు చాలా మంది ఆడవాళ్లు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు పైకి మాత్రమే ఆడవాళ్లుగా కనిపించినా పురుష భావజాలంతోనే ఉంటారు అంటూ మాధవి లత తెలియజేశారు. ఈ వీడియోని షేర్ చేసిన ఈమె సుదీర్ఘమైన పోస్ట్ కూడా చేశారు. చీర మీద పడి ఏడ్చే ప్రతి ఒక్కరికి మీ వెనుక మీరు చూసుకుంటే మీ మీద మీకే అసహ్యం కలిగే అంత బొక్కలు ఉంటాయి అవి సవరణ చేయండి. భారతదేశ సంప్రదాయం అంటే కట్టుబొట్టు ఒకటే కాదు అక్కడ ఎల్కేజీలో ఆగిపోయిన మీ ఆలోచన. వంటింట్లో మీ అమ్మ కూడా సా*న్లు, పొట్ట కనిపించేలా చీర పల్లు వేసుకొని పనులు చేస్తూ ఉంటారంటూ మాధవి లత ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.

?igsh=eXMxaGlscW51ejN4

Advertisement

హీరోయిన్ల విషయంలో ఇలా నీతులు చెప్పే అయ్యలు వారి సినిమాలో హీరోయిన్లు విప్పుకొని తిరుగుతున్నప్పుడు మాత్రం నోరు లేవదు. వయసు అయిపోయాకే ఇలాంటి నీతి మాటలు వస్తాయి అంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలపట్ల ఈమె పరోక్షంగా స్పందిస్తూ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .మాధవి లత చేసిన ఈ వ్యాఖ్యల పట్ల నెటిజన్ లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు . మీరు చెప్పింది అక్షరాల నిజమే అంటూ కొంతమంది కామెంట్లు చేయగా, మరీ కొందరు శివాజీకి మద్దతు తెలియజేస్తున్నారు. కొందరైతే ద్వాపర యుగంలో స్త్రీ చీర లాగినందకే యుద్ధం జరిగింది. కలియుగంలో మాత్రం మంచి బట్టలు వేసుకోమంటేనే యుద్ధం జరిగేలా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Shambhala Day 1 Collections: ఆది శంభాల ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లలంటే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×