E-Paper
Advertisement

Actress Death: 7దశాబ్దాల అనుభవం.. ప్రముఖ నటి కన్నుమూత!

Actress Death: 7దశాబ్దాల అనుభవం.. ప్రముఖ నటి కన్నుమూత!
Advertisement

Actress Death: చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీల మరణం అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది. ముఖ్యంగా కొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణిస్తే మరికొంతమంది వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ స్వర్గస్తులవుతున్నారు. అలా సంవత్సరాల తరబడి ఇండస్ట్రీలో ప్రేక్షకులను అలరించి.. దాదాపు 70 వసంతాలు పూర్తి చేసుకున్న ఒక నటి నేడు కన్నుమూయడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మరణానికి సంతాపం తెలియజేస్తూ తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నటి కామిని కౌశల్ (Kamini Kaushal).

కన్నుమూసిన ప్రముఖ నటి..

98 సంవత్సరాల వయసులో కామిని కౌశల్ తుది శ్వాస విడిచారు. 1927లో జన్మించిన ఈమె హిందీలో అనేక చిత్రాలలో నటించారు. ఈమె నటించిన మొదటి సినిమా నే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ చిత్ర అవార్డును గెలుచుకొని ఈమెకు మంచి విజయాన్ని అందించింది. 1946లో నీచా నగర్ అనే సినిమాతో ప్రారంభమైన ఈమె కెరియర్.. ఏడు దశాబ్దాల పాటు కొనసాగింది.. ఇండస్ట్రీలో 70 సంవత్సరాలు కు పైగా తన కెరీర్ ను కొనసాగించిన ఈమె.. నేడు అనారోగ్య సమస్యలతో మరణించడంతో సినీ సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు ఈమె మరణానికి సంతాపం తెలియజేస్తున్నారు.

కామినీ కౌశల్ సినిమాల విషయానికి వస్తే..

Advertisement

కామిని కౌశల్ కెరియర్ విషయానికి వస్తే.. ఏడు దశాబ్దాల సినీ కెరియర్లో హిందీ సినిమాలతో పాటు టెలివిజన్ సీరియల్స్ లో కూడా పనిచేసి నటిగా పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా హిందీ పరిశ్రమలో అత్యుత్తమ నటీమణులలో ఒకరిగా పేరు దక్కించుకున్న ఈమె.. ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. 1946 నుండి 1963 వరకు వరుస చిత్రాలలో హీరోయిన్గా నటించిన ఈమె.. ఆ తర్వాత 1963 నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించింది.

కామిని కౌశల్ అందుకున్న అవార్డులు..

తన ఏడు దశాబ్దాల సినీ కెరియర్లో 1956లోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్న ఈమె.. 1964లో ఉత్తమ సహాయ నటిగా BFJA అవార్డును దక్కించుకుంది. 2011లో కళాకార్ అవార్డులలో భాగంగా జీవిత సాఫల్య పురస్కారం అందుకుంది. అలాగే కల్పనా చావ్లా ఎక్సలెన్స్ అవార్డుతో పాటు ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును దక్కించుకుంది. ఉత్తమ నటి అవార్డ్ తో పాటు 2020లో కూడా ఉత్తమ సహాయ నటి ఫిలింఫేర్ అవార్డును కూడా దక్కించుకుంది.

కామిని కౌశల్ నటించిన చిత్రాలు..

Advertisement

ఈమె నటించిన చిత్రాల విషయానికొస్తే నీచా నగర్, జైలు యాత్ర, దో భాయ్, ఆగ్, షహీద్, పుగ్రీ, నదియా కే పర్, షైర్, షబ్నం, రాఖీ, పరాస్, నమూనా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలలో హీరోయిన్ గా నటించింది కామినీ కౌశల్.

 

ALSO READ:Shiva Re release: శివ రీ రిలీజ్.. థియేటర్ లో వర్మ సందడి మాములుగా లేదుగా!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×