E-Paper
Advertisement

Actress Imanvi: ఫౌజీ రిలీజ్ .. వాటికి దూరంగా ఉంటున్న ఇమాన్వి..గ్రేట్ అంటూ!

Actress Imanvi: ఫౌజీ రిలీజ్ .. వాటికి దూరంగా ఉంటున్న ఇమాన్వి..గ్రేట్ అంటూ!
Advertisement

Actress Imanvi: సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా సోషల్ మీడియా ద్వారా మంచి సక్సెస్ అందుకున్న వారు సినిమాలలో హీరోయిన్లుగా నటించే అవకాశాలను అందుకున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా డాన్సర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకొని ఏకంగా ప్రభాస్(Prabhas) తోనే సినిమా చేసే అవకాశం అందుకున్న వారిలో నటి ఇమాన్వి(Imanvi) ఒకరు. హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ఫౌజీ (Fauzi). ఈ సినిమా 2026 లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది..

ప్రభాస్ సినిమా కోసం ఇమాన్వి షాకింగ్ డెసిషన్..

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో ఇమాన్వి కీలక పాత్రలో నటించగా, మరొక కన్నడ బ్యూటీ చైత్ర జే ఆచార్ కూడా నటించబోతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా నటి ఇమాన్వి ఫౌజీ సినిమా కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కెరియర్ లో ఈ సినిమాకు ఎంతో ప్రత్యేకమని తెలిపారు. అయితే ఈ సినిమా విడుదల అయ్యే వరకు ఈమె ఎలాంటి బ్రాండ్ ఎండార్స్మెంట్ (Brand endorsement)చేయకూడదని నిర్ణయం తీసుకున్నారట. ప్రభాస్ తో సినిమా చేస్తున్నారు అంటే పెద్ద ఎత్తున ఈమెకు బ్రాండ్ ఎండార్స్మెంట్ అవకాశాలు వస్తున్నాయని, కానీ ఈ సినిమా విడుదల అయ్యేవరకు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

బ్రాండ్ ఎండార్స్మెంట్ కు దూరంగా ఇమాన్వి..

Advertisement

ప్రస్తుతం ఇమాన్వి తన దృష్టి మొత్తం ఈ సినిమా పైనే ఉంచారని తెలుస్తోంది. ఈమెకు ఇది మొదటి సినిమా కావడంతో ఈ సినిమాని చాలా ఛాలెంజింగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్నారు. ఇలా ఫౌజీ సినిమా కోసం వచ్చిన అవకాశాలను కూడా ఇమాన్వి వదులుకుంటున్న నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు చాలా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎంతోమంది సెలబ్రిటీలు ఇలా బ్రాండ్ ఎండార్స్మెంట్ చేస్తూ భారీ స్థాయిలో డబ్బు సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈమె మాత్రం సినిమా విడుదల అయ్యే వరకు ఇలాంటి వాటికి దూరంగా ఉంటానని చెప్పటం విశేషం.

ది రాజా సాబ్ ఫస్ట్ సింగిల్..

Advertisement

ఇక ఫౌజీ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాని 2026 ఆగస్టులో విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ పనులతో పాటు మరోవైపు మారుతి డైరెక్షన్లో రాబోతున్న ది రాజా సాబ్(The Raja Saab) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీ అవుతున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. 23వ తేదీ ఫుల్ సాంగ్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 9, 2026 లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

Also Read: Thalaivar 173: హమ్మయ్య తలైవార్ 173 కి డైరెక్టర్ దొరికినట్టేనా.. ఇంప్రెస్ అయిన రజని?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×