E-Paper
Advertisement

Varanasi Movie: మహేష్ వారణాసిలో దీపికా పదుకొనే.. కీలక పాత్రలో స్టార్ హీరోయిన్!

Varanasi Movie: మహేష్ వారణాసిలో దీపికా పదుకొనే.. కీలక పాత్రలో స్టార్ హీరోయిన్!
Advertisement

Varanasi movie: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందు రాబోతున్న చిత్రం “వారణాసి”(Varanasi). ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి(S.S.Rajamouli) దర్శకత్వంలో తెరకేక్కబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు (Mahesh Babu)హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు. ఈ సినిమా 2027లో విడుదల కాబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం ఒక వీడియో ద్వారా వెల్లడించారు. ఇలా ఈ సినిమాకు సంబంధించి ఒక చిన్న అప్డేట్ బయటకు వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతుంది.

మందాకినిగా ప్రియాంక చోప్రా..

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరొక బాలీవుడ్ హీరోయిన్ సందడి చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో మందాకిని అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.  ప్రియాంక చోప్రాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమాలో మరొక స్టార్ హీరోయిన్ కూడా నటించబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి .అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనేను(Deepika Padukone) సంప్రదించినట్లు సమాచారం. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం కోసం ఈమెను సంప్రదించగా దీపికా పదుకొనే కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

మహేష్ కు జోడిగా దీపికా..

Advertisement

ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా దీపిక పదుకొనే కనిపించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక విలన్ పాత్రలో ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారని స్పష్టమవుతుంది. ఈయన కుంభ పాత్రలో కనిపించబోతున్నట్టు అధికారికంగా వెల్లడించారు.   ఇప్పటికే 50% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మరొక ఆరు ఏడు నెలలలో షూటింగ్ పూర్తి చేసుకోబోతున్నట్లు రాజమౌళి స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర కాకుండా ఈయన మరో నాలుగు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

5 పాత్రలలో మహేష్..

Advertisement

ఏది ఏమైనా రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు సినిమా అంటేనే ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాని కేవలం పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.. ఇప్పటికే ఇంటర్నేషనల్ మీడియాతో పలు ఇంటర్వ్యూలను కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాని షో యు బ్యానర్ పై ఎస్ ఎస్ కార్తికేయ, శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే .ఈ సినిమా 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతోందని తెలుస్తుంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×