E-Paper
Advertisement

Toxic Film: యశ్ టాక్సిక్ టీజర్ వివాదం.. ఇంస్టాగ్రామ్ డిలీట్ చేసిన నటి!

Toxic Film: యశ్ టాక్సిక్ టీజర్ వివాదం.. ఇంస్టాగ్రామ్ డిలీట్ చేసిన నటి!
Advertisement

Toxic film: కేజిఎఫ్ నటుడు, పాన్ ఇండియా స్టార్ హీరో యశ్(Yash) నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్(Toxic). గీతు మోహన్ దాస్(Geethu Mohan Das) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డ్రగ్స్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హై వోల్టేజ్ యాక్షన్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ చూస్తేనే స్పష్టమవుతుంది. యష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవ్వడమే కాకుండా వివాదంలో కూడా నిలిచింది.

టాక్సిక్ టీజర్ పై ఫిర్యాదులు…

ఈ సినిమా టీజర్ లో కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఉన్న నేపథ్యంలో మహిళా కమిషన్ కు ఫిర్యాదులు వెళ్ళాయి. పలువురు రాజకీయ నాయకులు, మహిళా సంఘాలు ఈ టీజర్ పై మండిపడుతూ కర్ణాటక మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో మహిళా కమిషన్ కాస్త సెన్సార్ బోర్డుకు లేఖ రాస్తూ చర్యలు తీసుకోవాలని తెలిపారు. అయితే సెన్సార్ బోర్డు మాత్రం యూట్యూబ్ లో విడుదలైన ఈ టీజర్ కు తమకు ఎలాంటి సంబంధం లేదని తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే ఈ టీజర్ గురించి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో టాక్సిక్ సినిమా నటి ఇంస్టాగ్రామ్ డిలీట్ చేసి షాక్ ఇచ్చారు.

ఇంస్టాగ్రామ్ డిలీట్ చేసిన బ్రిటీజ్ టోపెన్ భాక్..

Advertisement

టాక్సిక్ టీజర్ లో బోల్డ్ సన్నివేశాలలో కనిపించిన నటి బ్రిటీజ్ టోపెన్ భాక్ (Beatriz Taufenbach) తన ఇంస్టాగ్రామ్ ఖాతాను తొలగించారు. అయితే ఈ ఇంటిమేట్ సీన్లపై వివాదం చెలరేగిన నేపథ్యంలోనే ఈమె ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైన అనంతరం ఈ టీజర్ లో కనిపించిన నటి ఎవరు అనే విషయంపై ఎంతో ఆత్రుత కనబరుస్తూ ఆమె కోసం తెగ సర్చ్ చేసారు. ఈమె హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి అని తెలుస్తుంది. ఇలా పలు హాలీవుడ్ సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్న బ్రిటీజ్ ఈ సినిమా ద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

ఉగాది సందర్భంగా విడుదల..

Advertisement

మొదటి సినిమా టీజర్ తోనే పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన ఈమె ఉన్నఫలంగా ఇంస్టాగ్రామ్ డిలీట్ చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ టీజర్ వివాదం కారణంగానే ఇంస్టాగ్రామ్ డిలీట్ చేశారా? లేదంటే మరేదైనా కారణం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ఈమెతో పాటు కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, నయనతార వంటి తదితరులు నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు లేడి డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాని ఉగాది పండుగ సందర్భంగా మార్చి 19వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

Also Read: Anil Ravipudi: గట్టిగా అనుకోండి అయిపోద్ది.. ఆ స్టార్ హీరో సినిమా పై అనిల్ కామెంట్స్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×