E-Paper
Advertisement

Hero Vijay Divorce: విజయ్‌కు భార్య షాక్.. పెళ్లయిన 26 ఏళ్లకు విడాకులు, ఆ రూమర్లే కారణమా?

Hero Vijay Divorce: విజయ్‌కు భార్య షాక్.. పెళ్లయిన 26 ఏళ్లకు విడాకులు, ఆ రూమర్లే కారణమా?
Advertisement

Hero Vijay Divorce: సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్న అంశం ఇటీవల కాలంలో విడాకుల పరంపర మరి కాస్త ఎక్కువగా జరుగుతుంది. ఒకప్పుడు పెళ్లయిన వెంటనే విభేదాల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయేవారు అయితే ఇటీవల పెళ్లి జరిగి పిల్లలు కూడా పెళ్లి వయసుకు వచ్చినప్పుడు కొంతమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోతుండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ పెళ్లయిన 18 సంవత్సరాలకు విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే.

విడాకులు కోరిన విజయ్ భార్య సంగీత..

ఇప్పుడు ఇదే బాటలో మరొక జంట కూడా విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో విజయ్ (Vijay)థలపతి ఒకరు. సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న ఈయన ఇటీవల రాజకీయ పార్టీని కూడా స్థాపించిన సంగతి తెలిసిందే. టీవీకే పార్టీ అధినేతగా విజయ్ ప్రస్తుతం రాజకీయ వ్యవహారాలలో బిజీగా ఉన్నారు అయితే గత కొంతకాలంగా ఈయన తన భార్య సంగీత(Sangeetha) విడాకులు(Divorce) తీసుకొని విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఈ జంట మాత్రం ఎక్కడ స్పందించలేదు.

26 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పబోతున్నారా?

Advertisement

ఇకపోతే తాజాగా విజయ్ వైఫ్ సంగీత విడాకుల కోరుతూ చంగల్ పట్టు కోర్టును ఆశ్రయించి పిటీషన్ దాఖలు చేశారు. త్వరలోనే ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈమె విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తలను నిజం చేయబోతున్నారనే చెప్పాలి. ఇక వీరిద్దరికీ 1999లో ఎంతో ఘనంగా వివాహం జరిగింది .ఈ దంపతులకు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. ఇలా పెళ్లయిన 26 సంవత్సరాలకు విడాకులు కోరడం ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలకు కారణం అయ్యింది.

నటి త్రిషతో రిలేషనే కారణమా?

Advertisement

సంగీత గత కొంతకాలంగా విజయ్ తో కలిసి ఎక్కడ బయట కనిపించిన సందర్భాలు లేవు. తన భర్త రాజకీయ ప్రచార కార్యక్రమాలలో కూడా ఈమె కనిపించలేదు. దీంతో విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి అంతేకాకుండా నటుడు విజయ్ త్రిష రిలేషన్ గురించి కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తల కారణంగానే విజయ్ కు సంగీత దూరం కాబోతోదంటూ గతంలో ఎన్నో రూమర్లు బయటకు వచ్చాయి అయితే ఈ రూమర్లు నిజం కావడంతోనే సంగీతం విడాకులు కోరారా? అనే సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి సంగీత విజయ్ 26 ఏళ్ల వైవాహిక బంధం నుంచి విడిపోవాలనుకోవడానికి గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది.

Also Read: Vijay Devarakonda Rashmika: బ్యాక్ టు హైదరాబాద్..ఎయిర్ పోర్టులో సందడి చేసిన విరోష్…

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×