E-Paper
Advertisement

Actor Suman:  శివాజీ మాటలు తప్పు.. అనసూయకు ఇచ్చి పడేసిన సుమన్?

Actor Suman:  శివాజీ మాటలు తప్పు.. అనసూయకు ఇచ్చి పడేసిన సుమన్?
Advertisement

Actor Suman: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల వస్త్రధారణ గురించి ఇటీవల నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల చోటు చేసుకున్న వివాదానికి ఇప్పటికి పులి స్టాప్ పడలేదని చెప్పాలి. శివాజీ(Sivaji) చేసిన ఈ వ్యాఖ్యలపై ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు అందరూ కూడా ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నటుడు సుమన్ (Suman)కూడా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా సుమన్ ఈ వివాదం గురించి మాట్లాడుతూ మహిళల వస్త్రధారణ గురించి శివాజీ మాట్లాడిన మాటలు పూర్తిగా తప్పని తెలిపారు. ముఖ్యంగా ఆయన ఉపయోగించిన పదాలు తప్పు అందుకు క్షమాపణలు కూడా తెలియజేశారు.

మరో కోణంలో కూడా ఆలోచించాలి..

శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలను కేవలం ఒక కోణంలో మాత్రమే కాకుండా మరో కోణంలో కూడా ఆలోచించాలని తెలియజేసారు. ఇక సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలకు సినిమా జీవితం వేరుగా ఉంటుంది, వ్యక్తిగత జీవితం వేరుగా ఉంటుంది .ముఖ్యంగా హీరోయిన్లు సినిమాలలో వారి పాత్రలకు అనుగుణంగా వారి వస్త్రధారణ ఉంటుంది. తాను జయమాలిని , సిల్క్ స్మిత వంటి వారితో కూడా పనిచేశానని తెలిపారు. అయితే వారు సినిమా షూటింగ్ లోకేషన్ లోకి వచ్చిన తర్వాత వారి పాత్రకు అనుగుణంగా దుస్తులు వేసుకునేవారు. షూటింగ్ పూర్తి అయిన తరువాత తిరిగి వాళ్లు సాధారణ జీవితం గడిపే వాళ్ళని సుమన్ గుర్తు చేసుకున్నారు.

సినిమాలలో కనిపించినట్టు బయట తిరగాల్సిన పనిలేదు..

Advertisement

సినిమాలలో కనిపించిన విధంగా, అలాంటి బట్టలు వేసుకొని బయట తిరగాల్సిన పని లేదంటూ పరోక్షంగా అనసూయకు కూడా కౌంటర్ ఇచ్చారు.. బయట ప్రపంచంలో ఎన్నో విభిన్న మనస్తత్వం ఉన్నవాళ్లు ఉంటారు. ఏదైనా సమస్య వచ్చిన తర్వాత బాధపడటం కంటే సమస్య రాకుండా చూసుకోవడం మంచిదంటూ ఈ వివాదం పట్ల సుమన్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సుమన్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజెన్లు కూడా విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

క్షమాపణలు చెప్పిన అనసూయ..

Advertisement

ఇక ఈ వివాదం గురించి అనసూయ మొదటిగా స్పందిస్తూ శివాజీకి వ్యతిరేకంగా వరుస పోస్టులు చేస్తూ వచ్చారు. ఇక ఎంతోమంది అనసూయకు మద్దతు తెలుపుగా మరికొందరు శివాజీకి మద్దతు తెలియజేస్తూ వచ్చారు. ఇక ఇటీవల నటి రాశి సైతం పరోక్షంగా అనసూయకు తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. గతంలో తన గురించి అనసూయ చేసిన వ్యాఖ్యలను కూడా రాశి బయట పెట్టడంతో అనసూయ పై తిరిగి వ్యతిరేకత మొదలైంది. ఈ నేపథ్యంలోనే  అనసూయ రాశికి క్షమాపణలు కూడా చెప్పిన సంగతి తెలిసిందే. ఇలా సెలబ్రిటీలో ఒక్కొక్కరుగా స్పందిస్తూ ఈ వివాదాన్ని ఇలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. మరి ఈ వివాదానికి పులిస్టాప్ ఎప్పుడు పడుతుందో తెలియాల్సి ఉంది.

Also Read: Chiranjeevi vs Allu Arjun: చిరంజీవికి పోటీగా అల్లు అర్జున్ .. పండగ పూట పోటీ అవసరమా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×