E-Paper
Advertisement

Actor Sivaji : సారీ చెప్సాల్సిందే.. నటుడు శివాజీకి పెద్దల ఫోర్స్.. మహిళా కమిషన్ నోటీసులు?

Actor Sivaji : సారీ చెప్సాల్సిందే.. నటుడు శివాజీకి పెద్దల ఫోర్స్.. మహిళా కమిషన్ నోటీసులు?
Advertisement

Actor Sivaji : టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. హీరోయిన్ల డ్రెస్సులపై శివాజీ షాకింగ్ కామెంట్స్ చేశారు. అందరూ చక్కగా చీరలు కట్టుకుని రావాలంటూ శివాజీ హితవు పలికారు. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లు వేసుకుంటూ సామాన్లు  మొత్తం చూపిస్తాన్నారంటూ హీరోయిన్లపై ఆయన మండిపడ్డారు. అయితే హీరోయిన్ల కట్టు బొట్టులపై కామెంట్స్ చేసిన శివాజీపై మహిళాలోకం మండిపడుతోంది. ఈ వివాదంపై పలువురు సినీ సెలబ్రిటీలు సైతం రియాక్ట్ అవుతున్నారు.

సారీ చెప్పే ప్రసక్తే లేదు

సాధారణంగా ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు సెలబ్రిటీలు వెంటనే క్షమాపణలు చెప్పి సర్దిచెప్పుకుంటారు. కానీ శివాజీ తీరు అందుకు భిన్నంగా ఉంది. తన సన్నిహితుల వద్ద ఆయన నేను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని తెగేసి చెప్పినట్లు సమాచారం. తాను చెప్పింది సంప్రదాయం గురించేనని, అందులో తప్పేముందని ఆయన వాదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన వాడిన భాషపై వస్తున్న విమర్శలను ఆయన ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

‘మా’ ముందుకు వివాదం

Advertisement

శివాజీ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. కేవలం సోషల్ మీడియా నిరసనలతో ఆగకుండా, ఈ విషయాన్ని ‘మా’ (Movie Artists Association) దృష్టికి తీసుకెళ్లాలని వారు నిర్ణయించుకున్నారు. తోటి నటీమణుల పట్ల అసభ్యకర పదజాలం వాడిన శివాజీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేయబోతున్నారు.

శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు?

అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, ఈ వ్యవహారాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ అత్యంత సీరియస్‌గా తీసుకుంది. బహిరంగ వేదికపై మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, బూతు పదజాలంతో మాట్లాడటం చట్టరీత్యా నేరమని భావిస్తోంది. ఈ క్రమంలోనే శివాజీకి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒకవేళ నోటీసులు అందితే, శివాజీ కమిషన్ ముందు హాజరై తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం ఇప్పుడు శివాజీని కోర్టులు, కమిషన్ల చుట్టూ తిప్పేలా కనిపిస్తోంది. తన మొండితనం శివాజీని మరింత చిక్కుల్లో పడేస్తుందా? లేక ఆయన తన తప్పు తెలుసుకుని వెనక్కి తగ్గుతారా? అనేది వేచి చూడాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×