E-Paper
Advertisement

Actor Shivaji: ఐబొమ్మ రవి పై శివాజీ ప్రశంసలు.. సూపర్ టాలెంట్ అంటూ!

Actor Shivaji: ఐబొమ్మ రవి పై శివాజీ ప్రశంసలు.. సూపర్ టాలెంట్ అంటూ!
Advertisement

Actor Shivaji: సినిమాలను పైరసీ చేస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్న ఐ బొమ్మ(I Bomma) నిర్వాహకుడు ఇమ్మడి రవి(Immadi Ravi) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈయన నుంచి పోలీసులు కీలక విషయాలను సేకరించారు సుమారు 21 వేల సినిమాలను పైరసీ చేసిన రవి సినిమా పైరసీల ద్వారా సుమారు 20 కోట్ల వరకు డబ్బు సంపాదించారని తెలుస్తోంది. ఈ సినిమా పైరసీ కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయికి కూడా తీసుకువెళ్లారు. ఈ పైరసీ తిమింగలం కోసం కాపు కాసిన పోలీసులు గత రెండు రోజుల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.. ఇలా రవి అరెస్టు కావడంతో చిత్ర బృందం మొత్తం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి తరుణంలోనే నటుడు శివాజీ (Shivaji)ఇమ్మడి రవి పై ప్రశంసలు కురిపిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దేశానికి ఉపయోగపడతాడు..

శివాజీ ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలోనే దండోరా (Dhandoraa)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా వేడుకలో భాగంగా నటుడు శివాజీ రవి గురించి మాట్లాడుతూ ప్రశంసల కురిపించారు. సినిమా పైరసీకి పాల్పడుతున్న అబ్బాయి రవిని పోలీసులు అరెస్టు చేశారు. రవి చాలా టాలెంట్ కలిగి ఉన్నాడని విన్నాను చాలా మంచి హ్యాకర్.. ఇలాంటి వాడిని దేశానికి ఉపయోగపడే విధంగా వాడుకుంటే చాలా మంచి జరుగుతుందని, ఏదైనా టెక్నికల్ పరంగా తన టాలెంట్ వాడుకుంటే మంచిదని తెలిపారు.

రవి టాలెంట్ పై శివాజీ ప్రశంసలు..

Advertisement

టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదని రవి ప్రూఫ్ చేశాడు. తనకున్నటువంటి టాలెంట్ తో చేసిన పని దుర్మార్గమే అయినప్పటికీ అతని టాలెంట్ వింటే మాత్రం దేశానికి కచ్చితంగా పనికొస్తారు . ఇలాంటి వారిని సెక్యూరిటీ సిస్టంలో ఉపయోగించుకుంటే మంచిదని రవి టాలెంట్ పై ప్రశంసలు కురిపించారు. ఇంత చిన్న వయసులోనే ఏ కారణాల చేత ఆ అబ్బాయి ఇలాంటి పనులకు పాల్పడ్డారో తెలియదు కానీ అతను చేసిన పని మాత్రం సరైనది కాదని తెలిపారు.

Advertisement

ఇలా సినిమాలను పైరసీ చేసిన వ్యక్తి పట్ల శివాజీ ప్రశంసలు కురిపించడంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించగా మరి కొంతమంది శివాజీకి పూర్తిగా మద్దతు నిలుస్తూ శివాజీ చెప్పిన దాంట్లో నిజం ఉందని ఇలాంటి టాలెంట్ కలిగిన వారిని మన దేశం కోసం ఉపయోగించుకుంటే మరింత మేలు కలుగుతుంది అంటూ మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక దండోరా విషయానికి వస్తే..శివాజీ, బిందుమాధవి, నవదీప్, రవికృష్ణ, నందు వంటి నటీనటులు కీలక పాత్రలలో కనిపిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టమవుతుంది. డిసెంబర్లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా టీజర్ విడుదల చేశారు.

Also Read: Pawan Kalyan: ఐబొమ్మ రవి అరెస్ట్.. సీ.పీ సజ్జనార్ కు పవన్ స్పెషల్ థాంక్స్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×