E-Paper
Advertisement

Salman Khan : అందరూ నన్ను అలాగే గుర్తించాలి..సల్మాన్ ఖాన్ షాకింగ్ ట్వీట్

Salman Khan  : అందరూ నన్ను అలాగే గుర్తించాలి..సల్మాన్ ఖాన్ షాకింగ్ ట్వీట్
Advertisement

Salman Khan : బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ తన జీవితంలో ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకోబోతున్నారు. బాలీవుడ్ ఖాన్ త్రిమూర్తులలో షారుఖ్, అమీర్ తర్వాత 60వ పడిలోకి అడుగుపెడుతున్న చివరి వ్యక్తి సల్మాన్. డిసెంబర్ 27న ఆయన తన 60వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సల్మాన్ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

సల్మాన్ ‘బీస్ట్’ మోడ్
చాలా మంది సల్మాన్ పుట్టినరోజును మర్చిపోయారేమో అన్నట్టుగా.. తన ఫిట్‌నెస్‌తో అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు భాయ్. “నాకు 60 ఏళ్లు వచ్చినప్పుడు ఇలా కనిపించాలని ఉంది.. ఇప్పటి నుండి కేవలం 6 రోజులు..” అంటూ జిమ్‌లో దిగిన కొన్ని ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Advertisement

నల్లటి టీషర్ట్, నీలిరంగు షార్ట్స్‌లో తన భారీ కండలను చూపిస్తూ..క్లీన్ షేవ్ లుక్‌లో ఉన్న సల్మాన్‌ను చూస్తుంటే.. ఆయనకు 60 ఏళ్లు అంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. అభిమానులు ఆయన ఫోటోలపై కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. మీకు 60 కాదు భాయ్.. ఇప్పుడే 30 ఏళ్లు వచ్చినట్లు ఉన్నాయని ఒకరు, మీకు సాటి ఎవరూ లేరు అని మరొకరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

‘గల్వాన్ యుద్ధం’
సల్మాన్ ఖాన్ తదుపరి చిత్రం ‘గల్వాన్ యుద్ధం’ పై భారీ అంచనాలు ఉన్నాయి. 2020లో భారత్-చైనా మధ్య జరిగిన గల్వాన్ వ్యాలీ ఘర్షణల నేపథ్యంలో అపూర్వ లఖియా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి సల్మాన్ మాట్లాడుతూ.. తన కెరీర్‌లోనే అత్యంత శారీరక శ్రమతో కూడిన ఫోటో ఇదేనని పేర్కొన్నారు.

Advertisement

వయసు పెరుగుతున్న కొద్దీ ప్రతి రోజూ కష్టమవుతోంది. ఇప్పుడు యాక్షన్ సీన్స్ కోసం పరిగెత్తడం, తన్నడం, గుద్దడం వంటివి చేయడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. ఈ సినిమా కోసం నేను నా శాయశక్తులా శ్రమిస్తున్నానని సల్మాన్ తన అంకితభావాన్ని చాటుకున్నారు.

బిగ్ బాస్ విన్నర్ అనౌన్స్‌మెంట్
ఇటీవలే సల్మాన్ ‘బిగ్ బాస్ 19’వ సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సీజన్‌లో ఆయన గౌరవ్ ఖన్నాను విజేతగా ప్రకటించిన విషయం తెలిసిందే. హోస్ట్‌గా బుల్లితెరపై మెప్పించిన సల్మాన్, ఇప్పుడు వెండితెరపై ‘గల్వాన్’ వీరుడిగా మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×