E-Paper
Advertisement

Harsha Vardhan: మందుబాబులకు హర్షవర్ధన్ అలెర్ట్.. ఏం చెబుతున్నారంటే?

Harsha Vardhan: మందుబాబులకు హర్షవర్ధన్ అలెర్ట్.. ఏం చెబుతున్నారంటే?
Advertisement

Harsha Vardhan:ప్రముఖ నటుడు హర్షవర్ధన్ (Harsha Vardhan) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ‘అమృతం’ సీరియల్ తో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. గుండు హనుమంతరావుతో కలిసి హర్షవర్ధన్ సన్నివేశాలు సీరియల్ కే హైలెట్ గా నిలిచేవి. అలా వీరి కాంబినేషన్లో వచ్చిన ఈ సీరియల్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. అలాంటి హర్షవర్ధన్ ఈమధ్య కాలంలో సినిమాలలో నటిస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కొన్ని చిత్రాలలో కీలకపాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్న ఈయన.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మొన్నటికి మొన్న సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన వస్త్రధారణ విషయంపై స్పందించి పలు కీలక వ్యాఖ్యలు చేసిన హర్షవర్ధన్.. ఇప్పుడు మందుబాబులకు పలు జాగ్రత్తలు కూడా చెబుతున్నారు మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..

మందు బాబులకు అలర్ట్..

ధూమపానం, మద్యపానం హానికరం.. అయినప్పటికీ మద్యపానం సేవిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే అందులో కొంతమంది లిమిట్ గా తీసుకుంటే మరి కొంతమంది పీకల వరకు తాగి అనారోగ్య బారిన పడుతున్నారు. అయితే మరికొంతమంది పలు జాగ్రత్తలు తీసుకుంటూ మద్యపానం సేవించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటుడు హర్షవర్ధన్ కూడా మద్యపానం చేసే వారికి పలు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా ఒక హీరో తండ్రి నుండి తాను ఈ విషయాలు తెలుసుకున్నానని, ఆయన పాటించడం చూసి ఆశ్చర్యం అనిపించిందని చెప్పుకొచ్చారు.

నితిన్ తండ్రి నుంచీ నేర్చుకున్నా..

Advertisement

ఈ మేరకు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్షవర్ధన్ మాట్లాడుతూ..” ఒక పెగ్గు మద్యం తాగిన తర్వాత కచ్చితంగా గ్లాస్ నీళ్లు తాగాలి. అలా ప్రతి పెగ్గుకు నీళ్లు తాగడం వల్ల శరీరం పైన మద్యం ప్రభావం తగ్గుతుంది.అయితే ఈ విషయాన్ని నేను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నుంచి నేర్చుకున్నాను. డ్రింక్ చేయడానికి ముందు ఆయన అర లీటర్ నీళ్లు తాగుతారు. ఇలా తాగడం వల్ల కొంతవరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని ఆయన చెప్పారు” అంటూ హర్షవర్ధన్ తెలిపారు. ఇక హర్షవర్ధన్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

also read:VK Naresh : నరేష్ బర్తడే స్పెషల్.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పవిత్ర.. ఫోటోలు వైరల్!

చిరంజీవి మూవీలో హర్షవర్ధన్..

Advertisement

ఇదిలా ఉండగా తాజాగా హర్షవర్ధన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో నటించారు. ఇందులో స్పెషల్ పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇక సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

హర్షవర్ధన్ కెరియర్..

శాంతి నివాసం, అమృతం, కస్తూరి వంటి సీరియల్స్ తో మంచి గుర్తింపు అందుకున్నారు. జెమినీ టీవీలో ప్రసారమైన అమృతం సీరియల్ లో కీలకమైన అమృత రావు పాత్రను పోషించి మంచి పేరు దక్కించుకున్నారు. కొండవీటి సింహాసనం, ఐతే, అతడు, అనుకోకుండా ఒక రోజు, పౌర్ణమి ఇలా ఎన్నో చిత్రాలలో నటించిన ఈయన 2015 లో చివరిగా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ అనే సినిమాలో నటించారు
ఇక తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు విరామం తీసుకుని మళ్లీ ‘చెక్’ అనే సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయారు.. అలా గత ఏడాది మేఘాలు చెప్పిన ప్రేమ కథ, పరదా, కోర్టు వంటి చిత్రాలలో నటించిన ఈయన తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో కొత్త ఏడాదిని ప్రారంభించారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×